Anushka Shetty: ఆ టాలీవుడ్‌ హీరోతో అనుష్క ఎఫైర్‌..షాక్‌ లో ప్రభాస్‌ ?

Tollywood Anushka Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో సౌందర్య ఎంత పాపులర్ కి తెచ్చుకున్నారో.. అచ్చం అలాంటి పాపులారిటీని హీరోయిన్ అనుష్క శెట్టి తెచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా అనుష్క శెట్టి అంటే పడి చచ్చేవారు చాలామంది ఉన్నారు. ఏజ్ పైబడినప్పటికీ… ఇండస్ట్రీలో తనకంటూ మంచి మార్క్ తెచ్చుకున్నారు.

ఇప్పటికి అనుష్క శెట్టి సినిమాలు వస్తున్నాయంటే ఎగబడి చూస్తారు జనాలు. ముఖ్యంగా హీరో ప్రభాస్ అలాగే అనుష్క శెట్టి సినిమాలంటే మరింత ఇష్టంగా తెలుగు ప్రేక్షకులు చూస్తారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరిగా సినిమాలు చేయడం లేదు ఈ బ్యూటీ. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ. ఈ సినిమా అంతంత మాత్రమే నడిచింది. కానీ ఇందులో అనుష్క శెట్టి చేసిన పాత్ర అద్భుతం.

Tollywood Anushka Shetty Friend ship With Hero

తన కంటే చిన్నవాడైనా నవీన్ పొలి శెట్టితో సినిమా చేసి.. అదరహో అనిపించింది అనుష్క శెట్టి. అంతేకాకుండా… ప్రెగ్నెన్సీ కోసం ఈ సినిమాలో అనుష్క చేసే ప్రయత్నాలు అద్భుతంగా చూపించారు. అలాంటి పాత్రలో కూడా అనుష్క శెట్టి చాలా అందంగా నటించగలిగింది.. దీన్నిబట్టి మనం చెప్పవచ్చు అనుష్కకు ఎంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయో అని..! అయితే ఇండస్ట్రీలో అనుష్క శెట్టిపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

- Advertisement -

ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడమే. హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుని ఉంటే… ఇలాంటి రూమర్స్ అస్సలు రావు. అయితే ఇప్పటివరకు అనుష్క శెట్టి చాలామందితో ఎఫైర్స్ పెట్టుకుందని వార్తలు వచ్చాయి. మొట్టమొదటగా సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను అడుగు పెట్టింది హీరోయిన్ అనుష్క. ఆ సినిమాలో హీరో నాగార్జున చేసిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ సినిమాలో నాగార్జున మరియు అనుష్క శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

దీంతో హీరో నాగార్జున అలాగే అనుష్క శెట్టి మధ్య ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చింది. అనుష్క ఎలాంటి తప్పు చేయలేదని తెలిసిపోయింది. ఆ తర్వాత హీరో ప్రభాస్ పేరు తెర పైకి వచ్చింది. హీరో ప్రభాస్ అలాగే అనుష్క శెట్టి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరో ప్రభాస్ అలాగే అనుష్క శెట్టి మధ్య సంబంధాలు కలిపేశారు. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇప్పటికి ప్రచారం చేస్తున్నారు.

కొత్త విషయం అనుష్క గురించి వచ్చింది. హీరో గోపీచంద్ తో… అనుష్క ప్రేమాయణం నడిపిందని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వీరు మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. యజ్ఞం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్… అనుష్కతో లక్ష్యం సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి ప్రేమలో పడ్డారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఇప్పటికి కూడా గోపీచంద్ తో అనుష్క చాలా క్లోజ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇవన్నీ చెత్త వార్తలని అనుష్క ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు