Kannappa: కన్నప్ప సినిమాలో ఇంత మంది స్టార్లు ఉన్నారా..లిస్ట్ పెద్దదే !

Kannappa: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా నందమూరి అలాగే మెగాస్టార్ కుటుంబానికి మంచి పాపులారిటీ ఉంటుంది. అలాగే ఈ కుటుంబాల తర్వాత అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు లైన్లోకి వస్తాయి. అయితే ఈ నాలుగు కుటుంబాలతో పాటు మంచు కుటుంబం కూడా పాపులర్ అయింది. మంచు మోహన్ బాబు విలక్షణ నటుడు అన్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు కారణంగా.. ఆయన కుటుంబం బాగా పాపులరిటి సంపాదించుకుంది.

All India Superstars Unite in Manchu Vishnu’s Kannappa

మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు స్టార్లు ఇండస్ట్రీలోకి వచ్చారు. మంచు మోహన్ బాబు కుమారులు విష్ణు అలాగే మనోజ్… ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వీరికి సరైన హిట్ లేకపోయినా ఈ ఇద్దరు హీరోలకు మంచి క్రేజీ మాత్రం ఉంది. అటు మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. అయితే మంచు కుటుంబాన్ని మరింత స్థాయికి తీసుకు వెళ్లేందుకు… మంచు విష్ణు అలాగే మోహన్ బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -
All India Superstars Unite in Manchu Vishnu's Kannappa
All India Superstars Unite in Manchu Vishnu’s Kannappa

ఇలాంటి నేపథ్యంలోనే కన్నప్ప అనే పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టారు. కన్నప్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నప్ప సినిమాలో ప్రధాన పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను 150 కోట్లతో మోహన్ బాబు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్టర్ చేయడం గమనార్హం. అంతేకాకుండా కన్నప్ప సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా చాలామంది వర్క్ చేస్తున్నారని ఇప్పటికే చిత్ర బంధం ప్రకటించింది.

శ్రీకాళహస్తి మరియు కన్నప్ప చరిత్ర కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కన్నప్ప సినిమాను తన ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ద్వారా నిర్మించబోతున్నారు మోహన్ బాబు. పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, జి నాగేశ్వర్ రెడ్డి అలాగే తోట ప్రసాద్ లు డెవలప్ చేసిన కథ ఆధారంగా ఈ సినిమాను మోహన్ బాబు తీసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇంత భారీ ఎత్తున తీస్తున్న ఈ సినిమాలో చాలామంది స్టార్ నటులు, హీరోయిన్లు, బాలీవుడ్ తారలు కనిపించనున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కన్నప్ప సినిమాలో నటించే నటీనటుల వివరాలు వైరల్ గా మారాయి. అయితే ఈ నటీనటుల వివరాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే… ఈ సినిమాలో హీరోగా మంచు విష్ణు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మంచు మోహన్ బాబు కూడా ఒకే ఒక పాత్రలో నటించినున్నారట. ప్రభాస్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్, నయన తార, ప్రీతి ముఖుందన్, ఐశ్వర్య భాస్కరన్, మధు తదితరులు నటిస్తున్నారట.

కన్నప్ప సినిమా తారలు (All India Superstars Unite in Manchu Vishnu’s Kannappa)

– మంచు విష్ణు
– మోహన్ బాబు
– ప్రభాస్
– మోహన్‌లాల్
– శివ రాజ్‌కుమార్
– అక్షయ్ కుమార్
– బ్రహ్మానందం
– శరత్ కుమార్
– కౌశల్ మంద
– రాహుల్ మాధవ్
– దేవరాజ్
– నయనతార
– ప్రీతి ముఖుందన్
– ఐశ్వర్య భాస్కరన్
– మధు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు