VD12 : ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్లపై దేవరకొండ కన్ను… ఛాన్స్ ఇస్తారా?

VD12 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ దారుణమైన నెగెటివిటీ కారణంగా డిజాస్టర్ గా మిగిలింది. ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టకపోవడం నిర్మాతలను టెన్షన్ పడుతోంది. ఇదిలా ఉంటే చాలా కాలం క్రితమే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీని స్టార్ట్ చేశాడు.

కానీ గౌతమ్ మూవీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల దాన్ని పక్కన పెట్టి అంతలోపు ఫ్యామిలీ స్టార్ ను పూర్తి చేశాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కథ పూర్తి అవ్వడంతో నెక్స్ట్ గౌతమ్ మూవీ VD12ని మళ్లీ రీస్టార్ట్ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు హీరోయిన్ ఛేంజ్ అయినట్టుగా తెలుస్తోంది. మేకర్స్ ఇద్దరు క్రేజీ హీరోయిన్లను అనుకుంటున్నారట. కానీ వరుస డిజాస్టర్ లలో ఉన్న విజయ్ దేవరకొండకు వాళ్లు అసలు ఛాన్స్ ఇస్తారా? అంటే…

విజయ్ దేవరకొండ కన్ను ఆ ఇద్దరు హీరోయిన్లపైనే…

ఫ్యామిలీ స్టార్ మూవీ రిజల్ట్ గురించి పక్కన పెట్టి ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీని పట్టా లెక్కించబోతున్నారు. ప్రస్తుతానికి VD12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఇందులో నటించబోయే హీరోయిన్ విషయమై రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను మేకర్స్ సంప్రదిస్తున్నారు అనే వార్త చక్కర్లు కొడుతోంది. ముందుగా ప్రేమలు హీరోయిన్ మమిత బైజును అనుకున్నారట. ప్రేమలు మూవీతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ హీరోయిన్ ను విజయ్ దేవరకొండ సరసన నటింపజేయాలని అనుకున్నారట. దీంతో టీం ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం జరిగింది.

- Advertisement -

ఇక మరోవైపు రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యలక్ష్మి బోర్సే వైపు కూడా చూస్తున్నారట మేకర్స్. ఈ ఇద్దరు హీరోయిన్లలో విజయ్ దేవరకొండ సరసన ఎవరో ఒకరు నటిస్తారని టాక్ నడుస్తోంది. కానీ తాజా సమాచారం ప్రకారం భాగ్యలక్ష్మి ఇప్పటికే కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

VD12కు అన్ని అడ్డంకులే…

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రాజెక్టు VD12 ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్స్ సెన్సేషన్ అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నారు. అయితే కొంతవరకు షూటింగ్ జరిగిన తర్వాత ఈ మూవీ ఆగిపోవడంతో క్యాన్సిల్ అయ్యిందని రూమర్లు వచ్చాయి. కానీ త్వరలోనే VD12 షూటింగ్ స్టార్ట్ కాబోతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె కూడా తప్పుకుంది. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ ఊరటను ఇవ్వలేకపోయింది. దీంతో గౌతన్ తిన్ననూరి ప్రాజెక్ట్ విజయ్ కు అత్యంత కీలకంగా మారబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు