Friday OTT Movies : ఓటిటీ ప్రియులకు అలెర్ట్… ఈ వారం రాబోతున్న హిట్ సినిమాలు ఇవే

Friday OTT Movies : ఈ వారం తెలుగు సినీ ప్రియులకు మరింత ప్రత్యేకం కాబోతోంది. ఏప్రిల్ 9న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది పర్వదినాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత మరొక రోజు గ్యాప్ ఇచ్చి అంటే ఏప్రిల్ 11న రంజాన్ పండుగ రాబోతోంది. దీంతో పిల్లలకు, పెద్దలకు ఈ వారం వరుసగా హాలిడేస్ రాబోతున్నాయి. ఇంకేముంది హాలిడేస్ అంటే చాలామంది సినీప్రియలు థియేటర్లకు క్యూ కట్టడం, లేదా ఓటీటీలోని ఇంట్రెస్టింగ్ సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేయడం చేస్తారు. అయితే ఈ వారం ముఖ్యంగా గామి, ఓం భీమ్ బుష్ వంటి పలు బ్లాక్ బస్టర్ తెలుగు మూవీస్ ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి ఈ ఫ్రైడే ఓటీటీలోకి రాబోతున్న ఆ ఇంట్రెస్టింగ్ హిట్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓం భీమ్ బుష్ – అమెజాన్ ప్రైమ్

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన కామెడీ అండ్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. గత నెలలో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉంది. మరి ఓటిటిలో చూసి నవ్వుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా?

2. గామి – జీ5

యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన ప్రయోగాత్మక చిత్రం గామి. మార్చ్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిట్ గానే నిలిచింది. ఏప్రిల్ 12 నుంచి గామి మూవీ జీ5 ఓటిటిలో అందుబాటులోకి రానుంది. మరి ఈ మూవీకి ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

- Advertisement -

3. ప్రేమలు

మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు కూడా ఒకటి. మమిత బైజు , నస్లీన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ రెండు ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతుండడం విశేషం. మలయాళం, హిందీ, తమిళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రేమలు మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ మాత్రం ఏప్రిల్ 12 నుంచి ఆహాలో అందుబాటులోకి రానుంది.

4. సైరన్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్

జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటించిన తమిళ థ్రిల్లర్ మూవీ సైరన్. ఈ మూవీ ఏప్రిల్ 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. సైరన్ థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

5. లాల్ సలాం – సన్ నెక్స్ట్

సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్ సలాం మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. థియేటర్లోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఓటిటిలోకి రాబోతోంది ఈ మూవీ. ఏప్రిల్ 12 నుంచి సన్ నెక్స్ట్ లో లాల్ సలాం అందుబాటులోకి రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు