Sri Vishnu : బాబీ తో శ్రీ విష్ణు..? క్రేజీ కాంబో!

Sri Vishnu :టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. కెరీర్ మాస్ జోనర్ కే పోకుండా తనకి సెట్ అయ్యే నార్మల్ మిడిల్ క్లాస్ సబ్జెక్టులతో సెలెక్టీవ్ గా సినిమాలు చేసుకుంటూ వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ఆ మధ్య కాస్త తడబడినా మళ్ళీ పుంజుకున్నాడు. లాస్ట్ ఇయర్ సామజవరగమనా తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న శ్రీ విష్ణు, ఈ ఇయర్ ఓం భీం బుష్ సినిమాతో మరో హిట్టును ఖాతాలో వేసుకున్నాడు. ఇక కెరీర్ మొదట్లో హీరో ఫ్రెండ్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ మినిమం గ్యారెంటీ హీరో అయ్యాడని చెప్పాలి. త్వరలో మీడియం రేంజ్ హీరోగా మారె ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈయంగ్ హీరో వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ కెరియర్ లో నెక్స్ట్ లెవల్ కి వెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ కొత్త దర్శకులకి కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడు. మంచి ఎంటర్టైన్మెంట్ కథ సిద్ధం చేసుకొని శ్రీవిష్ణు దగ్గరకి వెళ్తే ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందనే నమ్మకంతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు.

ఉగాది నాడు కొత్త సినిమా ప్రారంభం..

ఇక శ్రీ విష్ణు (Sri Vishnu) వరుస హిట్లతో దూసుకుపోతుండగా, ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో శ్రీవిష్ణు మరోహిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే శ్రీ విష్ణు ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ హీరో మినిమమ్ హిట్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అతను ఒక ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాబీ నిర్మాతగా సినిమాలు చేయబోతున్నాడు. అయితే బాబీ నిర్మాత గా చేయబోయే మొదటి సినిమాలో ఈ హీరో ఛాన్స్ అందుకున్నాడు. కోన వెంకట్, బాబీ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్తీ ఫిలిమ్స్, కె.ఎఫ్.సీ సంయుక్తంగా శ్రీవిష్ణు 19వ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ చిత్రంతో జానకి రామ్ మారెళ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవుట్ అండ్ అవుట్ హీలేరియర్ ఎంటర్టైన్మెంట్ గానే ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతలు అతిథులుగా లాంచ్..

ఇక శ్రీ విష్ణు సినిమా లాంచింగ్ వేడుకలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అతిథులుగా పాల్గొన్నారు . ముందుగా నిర్మాత నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్ ని దర్శకుడికి అందించారు. అలాగే దిల్ రాజు, వివి వినాయక్ఈ, అనిల్ రావిపూడి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రానికి విజయ్ బలగానిన్ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా చేయనుండగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేయనున్నారు. సామజవరగమన సినిమాకి రైటర్స్ గా వర్క్ చేసిన భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి కూడా రచయితలుగా వర్క్ చేస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఖచ్చితంగా ఈ మూవీ అందరికి నచ్చే ఎంటర్టైన్మెంట్ తోనే ఉంటుందని తెలిపారు. శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకులు ఆశించి అన్ని అంశాలు ఇందులో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇక వరుసగా రెండు హిట్స్ తో జోరు మీద ఉన్న శ్రీవిష్ణు ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు