Bellamkonda Sreenivas: లైనప్ చూస్తే అదుర్స్.. మళ్లీ బాటలో పడ్డారా..?

Bellamkonda Sreenivas.. బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా 2014లో అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు మొదటి సినిమాతోనే ఏకంగా స్టార్ హీరోయిన్ సమంతతో నటించే అవకాశాన్ని దక్కించుకొని.. భారీ క్రేజ్ అందుకున్నారు బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు , అల్లుడు అదుర్స్, సాక్ష్యం, సీత, కవచం వంటి చిత్రాలు మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దాంతో ఈయన ఫేడౌట్ అయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి.. కానీ మధ్యలో జయ జానకి నాయక, రాక్షసుడు సినిమాలు మాత్రం మళ్లీ బెల్లంకొండ శ్రీనివాస్ ను ఇండస్ట్రీలో నిలబడేలా చేశాయి.. ఇక అక్కడితో ఆగకుండా బాలీవుడ్ లో తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని చూసారు..కానీ ఈ సినిమాను రీమేక్ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశారు..

10 సంవత్సరాలుగా ఎదురుచూపు..
ఇకపోతే ఇండస్ట్రీలోకి బెల్లంకొండ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు పూర్తయింది.. కానీ ఇప్పటివరకు ఒక్క సరైన సక్సెస్ ని కూడా అందుకోలేకపోయారు.. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం టైసన్ నాయుడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాకి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తూ ఉండగా .. 14 డీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీ ఆచంట భారీ బడ్జెట్లో సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం..

- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా లైనప్..
ఒకప్పుడు ఒక్క సినిమా కోసం ఎదురుచూసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు వరుస లైనప్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. టైసన్ నాయుడు ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఉండగా.. ఈ సినిమాతో పాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ అలాగే మూన్ షైన్ పిక్చర్స్ తో సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.. వీటికోసం మునుపెన్నడూ చూడని లుక్ లో శ్రీనివాస్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ మూడు సినిమాలు కూడా చాలా విభిన్నమైన కథలతో ఇతని కెరియర్లో ఒక అధ్యయనాన్ని క్రియేట్ చేయబోతున్నాయని ఫిలిం మేకర్స్ చెబుతున్నారు.. కంటెంట్ డ్రైవింగ్ , యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు బెల్లంకొండ శ్రీనివాస్.

కమ్ బ్యాక్ సక్సెస్ అయ్యేనా..
దాదాపు 10 సంవత్సరాల పాటు సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు సరైన కం బ్యాక్ తోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.. మంచి యాక్షన్ , డాన్సులు చేసే బెల్లంకొండకు మంచి స్క్రిప్ట్ దొరికితే సత్తా చూపించడానికి సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి కథలే ఇప్పుడు ఈయనకు దొరికాయి.. ఇప్పుడు ఇస్తున్న ఈ కం బ్యాక్ ఈయనకు సక్సెస్ ను ఇస్తుందో లేదో చూడాలి. మొత్తానికి అయితే ఈ లైనప్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాలతో సక్సెస్ అవ్వాలి అని పాన్ ఇండియా హీరోగా కూడా పేరు తెచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి అందరి కోరిక మేరకు కం బ్యాక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు