Agent : సాక్షి వైద్య బ్యాగ్రౌండ్ ఇదా !

అఖిల్ అక్కినేని హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం “ఏజెంట్ “. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు.  అఖిల్ ఈ సినిమాలో ఇంటెర్నేషన్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ,ట్రైలర్ లు సినిమాపై అంచనాలని పెంచేసాయి. మలయాళ యాక్టర్ మమ్ముట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు.

భారీ అంచనాలు ,భారీ బడ్జెట్ నిర్మితమైన ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా సాక్షి వైద్య  హీరోయిన్ గా నటించింది. సురేందర్ రెడ్డి ఈ అమ్మాయిని ఆమె ఇంస్టాగ్రామ్ రీల్స్ చూసి సెలక్ట్ చేసారంట. సాధారణంగా అందరు యాక్టర్స్ డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అయ్యాను అంటుంటారు కానీ సాక్షి నిజగానే డాక్టర్. ముంబై లో ఫిజియోథెరఫిస్ట్ గా పని చేస్తున్న ఈమె సరదాగా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుండేది.

అఖిల్ సురేందర్ రెడ్డి సినిమా ఒకే అయిన తర్వాత అఖిల్ పక్కన హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలా అని చాలా చర్చలు జరిగాయంట అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో పూజ హేగ్దే అఖిల్ పెయిర్ హిట్ అయింది కాబట్టి మళ్ళీ పూజానే తీసుకుందామనుకున్నారంట కానీ డేట్స్ కుదరక పూజా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అప్పుడు సురేందర్ రెడ్డి ఎవరైనా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నారంట. పైగా సినిమా ఎక్కువ శాతం విదేశాల్లో ఉంటుంది కాబట్టి కొత్త అమ్మాయి ఐతే వర్క్ చేయడానికి బాగుంటుందని ఆలోచిస్తుండగా సాక్షి వైద్య రీల్స్ చూసి సురేందర్ రెడ్డి తనని సెలెక్ట్ చేసారంట. ఆడిషన్ తరువాత సాక్షిని ఒకే చేసారంట సురేందర్ రెడ్డి.

- Advertisement -

అలా సాక్షి డాక్తర్ గా పనిచేస్తూ అనుకోకుండా యాక్టర్ అయిపోయిందంట.అఖిల్ ఏజెంట్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వస్తుండటంతో ఆమె ఎక్సైట్ గా ఉన్న అంటూ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాక్షి వైద్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాబోతున్న గాండీవధారి అర్జున సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు