Citadel : హ్యాపీ బర్త్ డే సమంత

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. మరి ఆ సినిమాతో నిజంగానే ఏ మాయ చేసిందో ఏమో గాని తెలుగు ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. జెస్సి పాత్రలో సమంత ఆమె నటనతో అందంతో యూత్ లో కల్ట్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది.

ఏ మాయ చేసావే సినిమాతో సమంత కెరీయరే మారిపోయింది. వరుస సినిమాలతో తెలుగు ,తమిళ్ భాషల్లో బిజీ హీరోయిన్ అయిపొయింది. ఏడాదికి నాలుగు నుంచి ఐదు సినిమాలు రిలీజ్ అయ్యేవి అంటే ఆమె ఎంత బిజీ గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఏ మాయ చేసావే సినిమా తరువాత ఆమె ఎక్కువ తమిళ్ సినిమాలు చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన దూకుడు సినిమా సమంత కి తెలుగులో అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ వచ్చింది. ఇక ఆ తరువాత నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. సాధారణంగా నాలుగు హిట్ లు వస్తే గోల్డెన్ లెగ్, ప్లాప్ లు వస్తే ఐరన్ లెగ్ అని పిలిచే ఇండస్ట్రీలో సమంత హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది.

అతి తక్కువ మందికి వచ్చే లేడీ సూపర్ స్టార్ అనే స్టార్డం ని సమంత కొద్దీ రోజుల్లోనే సాధించింది. అలాగే ఏ మాయ చేసావే సినిమా ఆమెకి లైఫ్ తోపాటు లైఫ్ పార్టనర్ కి కూడా ఇచ్చింది. ఈ సినిమాతో కలిసిన నాగ చైతన్య, సమంతలు ఇద్దరు ప్రేమిచుకుని 2017 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

ఇండస్ట్రీలోనే క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య ల జంట పెళ్లి తరువాత ఏవో మనస్పర్థల కారణంగా కొద్దీ రోజులు దూరంగా ఉన్నారు. ఆ తరువాత వీళ్లిద్దరు 2021 అక్టోబర్ 2న అఫిషల్ గా డైవర్స్ తీసుకున్నారు. ఆ తరువాత డిప్రెషన్ కి గురైన సమంతకి కొద్దీ రోజులు మయోటిస్ అనే వ్యాధి కారణంగా  అనారోగ్య  సమస్యలతో సతమతయింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకొని మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం ఈమె సిటడెల్ అనే వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ లతో కలిసి నటించింది. ఈ సిరిస్ ఇంగ్లీష్ వర్సెన్ లో ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమ్ అవుతుంది

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు