టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.. సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో అడివి శేషు నటించినప్పటికీ.. ఆ సినిమాలు ఏవి పెద్దగా గుర్తింపుని తెచ్చి పెట్టలేదు. క్షణం మూవీతో సోలోగా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న శేష్ ఆ తర్వాత నుండి నటించిన ప్రతి మూవీతోనూ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకుంటు తన క్రేజ్ ను సినిమా సినిమాకి పెంచుకుంటూ వస్తున్నాడు.
ఇటీవల మేజర్ చిత్రంతో అడివి శేష్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేశారు. ఇక తాజాగా అడవి శేషు నటించిన “హిట్ 2″ థియేటర్స్ లో సందడి చేస్తుంది.సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా అడివి శేష్ ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు మహేష్ బాబుతో మరో త్రిల్లింగ్ మూవీ చేయాలని కోరాడు.
Read More: Indian 2: శ్రీ వారి సన్నిధిలో ….
దీనికి అడవి శేష్ సమాధానమిస్తూ.. ” ఈరోజు ఉదయమే ఆయనతో చాలాసేపు మాట్లాడా. సినిమా విజయం సాధించడంతో నా విషయంలో ఆయన చాలా గర్వంగా ఉన్నారు. ఆయన నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న. ఆయన అలా అనడంతో ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేసాయి. ఒక సోదరుడిగా ఆయనకి ఎప్పుడూ తోడుగా ఉంటానని చెప్పాను. హిట్ 2 ఎప్పుడు చూపిస్తావు అని అడిగారు. ఆయన అలా అనేసరికి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు ” అని తెలిపారు.
Read More: Tamannaah : బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...