టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది నిధి అగర్వాల్. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్నులో చేసి అందరినీ ఫిదా చేసింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక మూవీ తర్వాత వరుస ఆఫర్లను చేజిక్కించుకుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా హరిహర వీరమల్లులో అవకాశం కొట్టేసింది.
ఒక్కసారిగా పెద్ద సినిమాలో ఆఫర్ రావడంతో అంతా ఆమెను లక్కీ గర్ల్ అంటున్నారు. ఇక తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నిధి అగర్వాల్. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ తన మనసులోని మాటను బయటపెట్టింది.
Read More: Adivi Sesh: ఇది కదా కావాల్సింది
తనకి హీరో ధనుష్ తో నటించాలని ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఒకవేళ ధనుష్ తో నటించే అవకాశం వస్తే పారితోషికం కూడా తీసుకోనని చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ అందాల నిధికి ఆ అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి.
Read More: Dil Raju : సీజన్ క్యాష్
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...