Kantara : ఎట్టకేలకు మళ్లీ వస్తున్నా ‘కాంతార’

ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘కాంతార’. 15 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. దేశ వ్యప్తంగా 400 కోట్ల పైన వాసులు రాబట్టింది ఈ కన్నడ చిత్రం. ఇది కన్నడలో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ సినిమాగా నిలిచింది. దీనికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ తో పాటు పలువురి సూచనల మేరకు తానే హీరోగా నటించారు. దర్శకుడిగానే కాకుండా తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించాడు ఈ కన్నడ హీరో.

ఈ సినిమాలో హైలైట్ గా నిలిచిన ‘వరాహ రూపం’ సాంగ్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జి బ్యాండ్ వారు ఈ సాంగ్ తమదంటూ కోజికోడ్ జిల్లా కోర్టులో కోర్ట్ కాపీ రైట్ కేసు వేశారు. వరాహ రూపం పాట 2015 సంవత్సరంలో విడుదలైన నవరసం యొక్క రిప్-ఆఫ్ కి మూలంగా ఉందని వారి వాదన. అక్టోబర్ 28న కోజికోడ్ కోర్టు అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్‌ లలో ఉన్న ఈ సాంగ్ ప్రసారంపై స్టే విధించింది.

కేరళలోని కోజికోడ్ జిల్లా కోర్ట్ లో జరిగిన వాదన తర్వాత చివరకి తీర్పు కాంతార సినిమాకు అనుకూలంగా వచ్చంది. దీనితో నేటి నుండి ‘వరాహ రూపం’ సాంగ్ యూట్యూబ్ మరియు OTTలో తిరిగి అందుబాటులోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు