Aditi Rao Hydari : మణిహారం లాంటి సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా, అక్కినేని అమ‌ల కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ హీరోయిన్ రీతువ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. త‌ల్లీ కొడుకుల మ‌ధ్య ప్రేమానుబంధాలు, టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో శ్రీ‌కార్తిక్ ఈ చిత్రాన్ని  అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ సినిమాకి ముందు సుమారు అర‌డ‌జ‌న్ ప్లాప్‌లు ఎదుర్కున్నాడు శర్వానంద్‌.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి త‌ల్లీకొడుకుల సెంటిమెంట్ ని మిళితం చేస్తూ సినిమాను తెర‌కెక్కించిన విధానం బాగుంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శిల కామెడీ అద్భుతంగా ఉందంటున్నారు. ఒకే ఒక జీవితం సినిమాపై హైద‌రాబాద్ హీరోయిన్ అదితీరావ్ హైద‌రీ తాజాగా స్పందించింది.

ఈ చిత్రం నాకు క‌న్నీళ్లు తెప్పించింది. నా హృద‌యాన్ని న‌వ్వించినందుకు ధ‌న్యావాదాలు. ఈ విశ్వంలో అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తి గురించి ఒక సినిమా తీసినందుకు థ్యాంక్యూ. అమ్మ‌లు నిజంగా ప్ర‌పంచాన్ని, ఉత్త‌మ ప్ర‌దేశంగా మార్చుతారు. మ‌ణిహారం లాంటి ఈ సినిమాను మీ అమ్మ‌ల‌ను తీసుకెళ్లి చూడండి అని ట్విట‌ర్‌లో పేర్కొంది అదితి రావ్‌.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు