Pranitha : బ్రేక్‌ఫాస్ట్

టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొంద‌రూ మాత్ర‌మే వ‌రుస ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటున్నారు. మ‌రికొంద‌రూ మాత్రం కొన్ని చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌వుతుంది. ఇంకొంద‌రు ఫ‌లితాల‌తో ఎలాంటి సంబంధం లేకుండా ఆఫ‌ర్ల‌ను అందుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో క‌న్న‌డ భామ ప్ర‌ణిత ఒక‌రు. అన్ని రకాల టాలెంట్ తో పాటు అందంతో మెప్పిస్తోంది. ప్ర‌స్తుతం ఈమె సినిమాల‌కు దూరంగానే ఉంటోంది. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ హ‌డావిడి చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ప్ర‌ణిత బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ప్ర‌స్తుతం ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. చిన్న వ‌య‌సులోనే మోడ‌ల్‌గా సంద‌డి చేస్తున్న స‌మ‌యంలోనే ప్ర‌ణిత సుభాష్ పోర్కి అనే క‌న్నడ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కూడా ఏం పిల్లో ఏం పిల్ల‌డో అనే సినిమాతో పరిచ‌య‌మైంది. ముఖ్యంగా తెలుగులో అత్తారింటికి దారేది, ర‌భ‌స‌, బ్ర‌హ్మోత్స‌వం వంటి సినిమాలు ప్ర‌ణిత‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

తెలుగులో ఆమెకు త‌క్కువ హిట్ సినిమాలే ఉన్నాయి. అయితే క‌ర్నాట‌క‌కు చెందిన ప్ర‌ణిత ఎక్కువ‌గా క‌న్న‌డంలోనే సినిమాల‌ను చేసింది. త‌మిళంలో కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. హిందీలో కూడా హంగామా 2, భుజ్: ‘ద ప్రైజ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాల‌ను చేసింది. ఇలా అన్ని భాష‌ల్లో సినిమాల‌ను చేసింది ఈ బ్యూటీ. దీంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ప్ర‌ణిత‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు