Sudheer Babu : అప్సర రాణి తో..

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిట్, ఫ్లాట్ లతో సంబంధం లేకుండా విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు. సుధీర్ బాబు తాజాగా నటించిన చిత్రం ” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సుధీర్ బాబుకు హిట్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో తన జానర్ ని వదిలేసి “హంట్” అనే యాక్షన్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రంతో మహేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

భవ్య క్రియేషన్స్ పథాకంపై వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కాప్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తుండు. పోలీస్ పాత్రలో ఆయన పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి “గన్స్ డోంట్ లై” అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ పెట్టి ఈ సినిమాపై అదిరిపోయి అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాలోని మాస్ బీట్ సాంగ్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. “పాపతో పైలం” అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ని అక్టోబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అప్సర రాణి ఈ ఐటెం సాంగ్ లో అలరించనుంది. నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమాకై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు