Keerthy Suresh : సొంత బిడ్డలా ప్రేమిస్తా..

కీర్తి సురేష్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది కీర్తి సురేష్ నుండి గుడ్ లక్ సఖీ, సాని కాయితం (తెలుగులో చిన్ని), సర్కారు వారి పాట, మలయాళంలో వాషి అనే చిత్రాలను చేసింది. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట మినహా అన్ని కూడా నిరాశపరిచాయి. తాను చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవడంపై కీర్తి సురేష్ తాజాగా స్పందించింది.

తాను చేసే సినిమాలు ఫ్లాప్ అయినా, హిట్ అయినా అన్నింటినీ తాను ప్రేమిస్తానని చెప్పుకొచ్చింది. ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా అని తాను వర్గీకరించలేనని తెలిపింది. ఎంతో కష్టపడి చేసిన సినిమా బాగా ఆడక పోతే కాస్త బాధ మాత్రం ఉంటుందని అన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ రాలేదని చెప్పకొచ్చింది. ”కథలో కొత్తదనం చూసి ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆ సినిమా అనుకున్నట్లుగా తెరపైకి రావచ్చు.. రాకపోవచ్చు. అలా వస్తే సినిమా హిట్ అవుతుంది. లేకుంటే ఫ్లాప్ అవుతుంది. కానీ నేను ఒప్పుకున్న ప్రతి సినిమాకు వంద శాతం మనసు పెట్టి కష్టపడి చేస్తాను. అలాగే ఒకటి రెండు ఫ్లాప్ లు వచ్చినంత మాత్రాన కెరీర్ ముగిసినట్టు కాదు. పరాజయం అనేది ఒక అనుభవంగానే తీసుకుంటా. అలాగే నేను చేసే ప్రతి సినిమాను సొంత బిడ్డల్లా ప్రేమిస్తాను” అంటూ ఈ మహానటి చెప్పుకొచ్చింది.

కాగా కీర్తి సురేష్ ప్ర‌స్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్ర‌లో ‘భోళా శంక‌ర్’ సినిమాలో న‌టిస్తోంది. అలాగే నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ చిత్రాన్ని చేస్తుంది. దీంతో పాటు తమిళంలో ‘మామన్నన్’ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు