Manchu Lakshmi : ఎవడి దూల వాడిది

మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుండగా.. మనోజ్ చర్య దానికి మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది. గత కొంతకాలంగా మంచు మనోజ్, భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికా రెడ్డితో వివాహం జరగబోతుంది అనే వార్త చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే.

తాజాగా వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండీ లో ఓ వినాయక మండపానికి వీరిద్దరూ కలిసి రావడం, పక్క పక్కనే నిల్చోని పూజలు చేయించడంతో ఈ వార్త వాస్త‌వ‌మేనని అభిప్రాయం మరింత బలపడింది. తన పెళ్లి అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మాత్రం మనోజ్ నో కామెంట్ అనేశాడు. అయితే తాజాగా మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై మంచు లక్ష్మి రియాక్ట్ అయింది.

తమ్ముడి రెండో పెళ్లి మీద కౌంటర్లు వేసినట్లుగా కామెంట్లు చేసింది. ” మనోజ్ ఇప్పుడు రెండో వివాహం చేసుకోబోతున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని సదురు యాంకర్ ప్రశ్నించగా.. మనోజ్ పెళ్లి చేసుకుంటుంటే నేనేమంటానండి బాబు. ఎవడి దూల వాడిది.. ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనీయండి. హానెస్ట్ లవ్ ని నేను బ్లెస్ చేస్తా. ఈ విషయంలో నేను హ్యాపీగానే ఉన్నాను. లైఫ్ లో రెండే రెండు ఎమోషన్స్.. ఒకటి లవ్.. రెండు భయం.. లైఫ్ ని లవ్ తో లీడ్ చేస్తున్నామా? లేదంటే భయంతో లీడ్ చేస్తున్నామో తెలుసుకోవాలి. నా లైఫ్ ని నేను లవ్ తోనే లీడ్ చేస్తున్నా”. అంటూ చెప్పుకొచ్చారు మంచు ల‌క్ష్మి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు