Telugu Actress: ఐపీఎస్ తో వివాదం. అయ్యో.. డింపుల్ కి ఎంతకష్టమొచ్చింది

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతికి కష్టాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. తెలుగు హీరోయిన్ అయిన డింపుల్ కి టాలీవుడ్ లో ముందునుంచే అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరోయిన్లలో ఈ హీరోయిన్ ముందు వరుసలో ఉంటుంది. కానీ అదృష్టం కూడా తోడవ్వాలి. గల్ఫ్ అనే సినిమాతో పరిచయమైన ఈ భామ ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ రెండు డిజాస్టర్లు గా మిగిలాయి. ఇక తాజాగా సినిమా పరంగా కాకుండా సొసైటీ లోను డింపుల్ హయతి కష్టాలు ఎదుర్కుంటోంది.

తాజాగా ఓ కార్ పార్కింగ్ వివాదంలో పోలీసులతో సమస్యలు ఎదుర్కొంటుంది. వివరాల్లోకి వెళితే ఐపీఎస్ అధికారి అయిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, డింపుల్ హయతి జూబ్లీహిల్స్ జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నారు. అప్పుడప్పుడు వీరి మధ్య పార్కింగ్ ప్లేస్ లో గొడవ అయ్యేదని, అందువల్ల కారణం లేనిదే తమ కారుపై చలాన్లు విధించేవారని అక్కడి అపార్ట్ మెంట్ వాసులు చెప్పారు. ఈ సమస్యపై సహనం కోల్పోయిన డింపుల్ కారుని తన కాలితో తన్నింది.

అయితే దీనిపై ఆ ఐపీఎస్ అధికారి తన కారును ఉద్దేశ‌పూర్వ‌కంగా ఢీకొట్ట‌డంతో పాటు పార్కింగ్ స్థ‌లంలో అడ్డంకులు క‌లిగిసున్నారని డింపుల్ తో పాటు ఆమె స్నేహితుడిపై కూడా పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు. ఈ విషయంపై పోలీసుల వాదన ఇలా ఉంది.

- Advertisement -

డింపుల్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒకే అపార్ట్ మెంట్లో నివాసముంటున్నారు. ఈ రోజు ఐపీఎస్ అధికారి వాహ‌నాన్ని డింపుల్ స్నేహితుడు పార్కింగ్ ప్లేస్ లో ఢీ కొట్టారు. అదేంట‌ని కారు అధికారి డ్రైవ‌ర్ ప్ర‌శ్నించ‌గా వాగ్వాదానికి దిగారు. గ‌తంలో కూడా పార్కింగ్ విష‌యంలో ప‌లుమార్లు వాగ్వాదానికి దిగిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఇక ఇందులో ఎంత నిజముందో స్పష్టమైన క్లారిటీ రాలేదు

అయితే తమపై ఉద్దేశపూర్వకంగా తప్పు లేకపోయినా కావాలని కేసులు పెట్టారని, తాము కూడా ఐపీఎస్ అధికారి పై కేసు పెడితే పోలీసులు కేసు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని డింపుల్ సోషల్ మీడియా ద్వారా చెప్పింది. ఇక తాజాగా “అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎప్పటికి దాగదు” అని డింపుల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ వివాదం పై సోషల్ మీడియా లో డింపుల్ కే ఎక్కువ మద్దతు వస్తున్నట్టు తెలుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు