Vikram Health Update: చియాన్‌ ఇంకా కోలుకోలేడా ? అసలేమైంది ?

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కి ఇటీవలనే షూటింగ్ లో జరిగిన ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. కబాలి సినిమా ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో తంగళన్ అనే సినిమాలో నటిస్తున్న విక్రమ్ కి ఈ షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.

ఇటీవలనే విక్రమ్, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా యాక్టీవ్ గా పాల్గొన్న విక్రమ్, పొన్నియన్ సెల్వన్ సినిమా రిలీజైన తరువాత తంగళన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్నాడు. సాధారణంగా యాక్షన్ సన్నివేశాలలో స్టార్ హీరోలు డూప్ లని వాడతారు కానీ ఈ విధంగా డూప్ లని వాడటానికి ఇష్టపడని విక్రమ్ దాదాపు ఆయన సినిమాలన్నిటిలో యాక్షన్ స్టంట్స్ ఆయనే చేస్తాడు. అందుకే విక్రమ్ చాలా డెడికేషన్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

గతంలో కూడా విక్రమ్, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో ఉన్న రిస్క్ స్టంట్స్ అన్నీ డూప్ సాయం లేకుండా తానే చేసాడు. అదే విధంగా తంగళన్ సినిమాలో కూడా చేయడానికి ప్రయత్నించిన విక్రమ్ కి రిబ్ ఇంజ్యూరీ అయింది. దాంతో వెంటనే మూవీ యూనిట్ అలర్ట్ అయ్యి హాస్పిటల్ లో చేర్పించారు. అయితే గత కొద్దిరోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న విక్రమ్ ఈ మధ్యనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు.

- Advertisement -

తాజాగా హిందీ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కెన్నడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా కథని మొదటగా తమిళ్ యాక్టర్ విక్రమ్ కి చెప్పినట్టు, కానీ విక్రమ్ సరిగా రెస్పాండ్ అవ్వకపోయేసరికి రాహుల్ భట్ తోనే తీయ్యాల్సి వచ్చిందని, ఆయన చెప్పగా.. విక్రమ్ ఈ విషయంపై స్పందిస్తూ తన ఫోన్ పని చేయకపోవటంతో, సరిగా రెస్పాండ్ అవ్వలేకపోయానని ఆయన చెప్పడంతో వివాదం ముగిసింది.

అయితే ఈ విషయం సరే సరి. కానీ, విక్రమ్ హెల్త్ కండిషన్ పై మాత్రం ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఆయనకి ట్రీట్మెంట్ అందించిన డాక్టర్స్ మొదటగా క్రిటికల్ కండిషన్ లో ఉన్నడని చెప్పగా ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు చూస్తే విక్రమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా, తన హెల్త్ గురించి మాత్రం ఫ్యాన్స్ లో ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. అయితే కోలీవుడ్ లో వస్తున్న కొన్ని వార్తల ప్రకారం, విక్రమ్ కు చికిత్స అయిపోయిందని, ప్రస్తుతం తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనిపై విక్రమ్ గానీ, ఆయన పీఆర్ టీం గానే స్పందిస్తే, ఫ్యాన్స్ కు కాస్త ఉపశమనంగా ఉంటుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు