Simhadri: అనుకున్నదే జరిగింది. న్యూట్రల్ ఆడియన్స్ దెబ్బ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “సింహాద్రి” తన బర్త్ డే కానుక గా మే 20న రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు సింహాద్రి సినిమాతో ఎలాగైనా రీ రిలీజ్ సినిమాల రికార్డులు బ్రేక్ చేయాలనీ ప్రతిష్టాత్మకంగా సింహాద్రి సినిమాను దగ్గరుండి ప్రమోట్ చేసారు. టాలీవుడ్ లో ఎదో కొత్త సినిమా రిలీజ్ అవుతున్నట్టు లిరికల్ సాంగ్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ లతో పాటు, ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఈ సినిమా కు నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ వచ్చి ప్రమోట్ చేసాడు.

ఇక మే20న అట్టహాసంగా పెద్ద సినిమాల లెవెల్లో అత్యధికంగా 1200 పైగా స్క్రీన్ లలో విడుదల చేసారు. దాని వల్ల రీ రిలీజ్ చిత్రాల్లో ఫస్ట్ డే సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఖుషి రికార్డు ని కొద్దిలో మిస్ అయ్యి 4. 01 కోట్ల గ్రాస్ వచ్చింది. సరే ఫస్ట్ డే మిస్ అయింది, మాస్ సినిమా కాబట్టి బి, సి సెంటర్లు తర్వాత రోజు ఫుల్ అవుతాయని అనుకున్నారు. కానీ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10శాతం థియేటర్లలో కూడా హౌస్ ఫుల్ కాలేదు. రెండో రోజు సింహాద్రి తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షలు, మూడో రోజు 7లక్షలు వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా రెండు, మూడు రోజుల్లో కేవలం 36లక్షలు మాత్రమే వసూలు చేసింది.

ఇక సింహాద్రి చిత్రం మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 4. 37కోట్ల గ్రాస్ వసూలు చేసి రీ రిలీజ్ చిత్రాల్లో రెండో స్థానం లో నిలిచింది. ఈ కలెక్షన్లను బట్టి ఖుషి రికార్డు ప్రస్తుతానికి బ్రేక్ అవ్వదు. కానీ ముందు ముందు రీ రిలీజ్ అయ్యే ఖలేజా, అతడు, బద్రి సినిమాలకు ఛాన్స్ ఉంది. ఇక సింహాద్రి సినిమాకు మొదటి రోజు భారీ థియేటర్లు కేటాయించడమే తర్వాత కలెక్షన్లు పడిపోవడానికి కారణం అయింది. ఇన్ని థియేటర్లలో విడుదల అవడం వల్ల రీ రిలీజ్ మూవీస్ చూసే ఆడియన్స్ సొంత ప్లేసుల్లో చూడడంతో ఎక్కడా ఎక్కువగా హౌస్ ఫుల్స్ కాలేవు. అదీ గాక ఈ సినిమాను అభిమానులు తప్ప న్యూట్రల్ ఆడియన్స్  పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా థియేటర్లు ఎక్కువగా ఖాళీ అయ్యాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు