Love Life : అమ్మాయిని పడేయాలనుకుంటున్నరా? ఈ కొత్త టిప్స్ ట్రై చేయండి

ఆడవాళ్ళ మనసును తెలుసుకోవడం, వాళ్లను సంతోష పెట్టడం చాలా కష్టమైన పని అని అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. వాళ్లకు కావాల్సిందల్లా ప్రేమ, ఆప్యాయత, వాళ్లు కోరుకునే చిన్న చిన్న సంతోషాలు, నమ్మకం. ఒకవేళ మీరు ఇవన్నీ ఇవ్వగలిగితే అమ్మాయిలు ఈజీగా పడిపోతారు. మీకు నచ్చిన అమ్మాయి హృదయాన్ని గెలుచుకోవాలి అనుకుంటే ఆమెను దగ్గరగా గమనించండి, తన ఇష్టా అయిష్టాలను తెలుసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు మీకు నచ్చిన అమ్మాయిని అర్థం చేసుకోవడానికి, తనని మీ లవ్ లో పడేయడానికి అవసరమయ్యే కొన్ని టిప్స్ మీ కోసమే అందిస్తున్నాం.

1. అమ్మాయిని ప్రేమలో పడేయాలి అంటే ముందుగా వాళ్ళ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను అర్థం చేసుకోవడం అసాధ్యం అంటూ చేతులు ఎత్తేస్తారు. ఇది ఒక సాకు మాత్రమే. నిజంగా ఆ అమ్మాయిని ఇష్టపడితే ఆమెతో కలిసి కొంత సమయం గడపడానికి ట్రై చేయండి. ఎంత ఎక్కువ సమయం కలిసి గడపగలిగితే అంతగా ఆమెను అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది.

2. ఇక అమ్మాయిలు కోరుకునే మరో ముఖ్యమైన అంశం భద్రత. అమ్మాయిలు ఎప్పుడూ అబ్బాయిల నుంచి భద్రతను, నమ్మకాన్ని కోరుకుంటారు. అంటే అబ్బాయిలు ఆ అమ్మాయి రాకపోకలు, బయట వ్యక్తులతో వాళ్ల సంబంధాల గురించి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయకూడదు. ఏదైనా అవసరం అయితే ఆమె తెలియజేస్తుంది.

- Advertisement -

3. ఇక మీరు అందంగా, సెక్సీగా ఉన్నారు అంటే అమ్మాయిలను పడేయడానికి అదొక మంచి దారి. లుక్స్ అనేవి కచ్చితంగా అమ్మాయిలను ఆకర్షిస్తాయి. కానీ అందంగా మాత్రమే ఉంటే సరిపోదు. అంతకుమించి ఆత్మవిశ్వాసం ఉండడం కూడా ముఖ్యం.

4. ఇక రిలేషన్ ఏదైనా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మీ రిలేషన్ ను ఏర్పరచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాల్సి రావచ్చు. ఆ అమ్మాయికి మీపై నమ్మకం కలిగేలా చేయండి. ఆ క్రమంలో ఆ అమ్మాయి బాధపడేలా ఎలాంటి పనులు చేయకూడదని గుర్తుపెట్టుకోండి.

5. అలాగే అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోండి. మహిళలకు గౌరవం ఇచ్చే అబ్బాయిలను నిజంగా ఇష్టపడతారు. ఇక మీకు ఉండే వివిధ సమస్యల పరిష్కారానికి వారి సలహా కోరండి. అలాగే వారిని ప్రేమగా చూసుకోండి.

6. జీవితంలో ముఖ్యంగా సంబంధాలలో మార్పు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎప్పుడూ రొటీన్ లైఫ్ మైంటైన్ చేయకుండా, అప్పుడప్పుడు మీకు నచ్చిన అమ్మాయి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. దీనివల్ల ఇద్దరికీ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక సర్ప్రైజ్ చేసే అబ్బాయిలను అమ్మాయిలు కచ్చితంగా ఇష్టపడతారు.

7. మీ భావాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండండి. అమ్మాయి బాగుంది అనిపిస్తే వెంటనే చెప్పేయండి. ఈరోజు ఆమె వేసుకున్న డ్రెస్ నచ్చిందా? హెయిర్ స్టైల్ బాగుందనీ అనిపించిందా అదే విషయాన్ని ఆమెకు చెప్పండి. ఇలాంటి విషయాలను అబ్బాయిల నుంచి వినడానికి అమ్మాయిలు ఇష్టపడతారు. మీకు నచ్చిన అమ్మాయిని దగ్గర చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

8. సాధారణంగా చాలామంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిని సంతోష పెట్టడానికి బహుమతులు ఇవ్వడం ఈజీ వే అని అనుకుంటారు. ఈ పద్ధతి మంచిదే. కానీ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఉండి, ఎమోషనల్ గా ఇద్దరూ కనెక్ట్ అయినప్పుడే అది వర్క్ అవుట్ అవుతుంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు