VD 12 Update: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీకి మోక్షం

“విజయ్ దేవరకొండ 12” సినిమా మూవీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ మూవీ మళ్లీ రీస్టార్ట్ కాబోతోంది అని సమాచారం. కొంతవరకు షూటింగ్ జరిగిన తర్వాత ఈ మూవీ ఎందుకు ఆగిపోయింది? అసలు ఈ మూవీ ఎప్పుడు రీస్టార్ట్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం “ఫ్యామిలీ స్టార్” మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మార్చ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా, ప్రస్తుతం అమెరికాలో దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ హీరోగా, ‘జెర్సీ’ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో రావాల్సిన మూవీకి సంబంధించిన అప్డేట్ అనధికారికంగా బయటకు వచ్చింది. చాలా కాలం క్రితమే ఈ మూవీ పట్టాలెక్కాల్సింది. “ఫ్యామిలీ స్టార్” మూవీ కంటే ముందే ఈ మూవీ రావాల్సింది. పైగా ఆ మూవీ కంటే ముందే “విజయ్ దేవరకొండ 12” మూవీకి సంబంధించి కొంతవరకు షూటింగ్ కూడా జరిగింది. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయకపోవడంతో, విజయ్ దేవరకొండ కెరియర్ లో 12వ మూవీ కావడంతో దీన్ని “విజయ్ దేవరకొండ 12” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. అయితే అప్పట్లో ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్” పై కాన్సన్ట్రేట్ చేశాడు. దీంతో అసలు విజయ్ దేవరకొండ 12 మూవీ ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా “విజయ్ దేవరకొండ 12” మూవీకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.

ఆ అప్డేట్ ప్రకారం గౌతం తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న “విజయ్ దేవరకొండ 12” మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుంది. ఇక ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం శ్రీలీల మార్చ్ లో డేట్లు కూడా కేటాయించారట. అప్పట్లోపు విజయ్ దేవరకొండ కూడా “ఫ్యామిలీ స్టార్” మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ మూవీని రీస్టార్ట్ చేయనున్నాడు. “విజయ్ దేవరకొండ 12” చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్న ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రూపొందింది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు