Eagle: నా సామి రంగ మిస్ అయింది… ఈ సారి ఈగల్ వంతు

ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఒక సినిమా పోస్ట్ పోన్ కాబోతోంది అనే వార్త గట్టిగా వినిపిస్తోంది. అయితే ఎవరికి వారే మేకర్స్ తమ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాము అంటూ ఎప్పటికప్పుడు పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటిదాకా “నా సామి రంగ” మూవీ విషయంలో ఇలా జరిగింది. తాజాగా “ఈగల్” వంతు వచ్చింది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ విషయంలో గందరగోళం నెలకొంది. ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోబోతోంది అనే ప్రచారం జోరుగా నడుస్తోంది.

మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ “ఈగల్” సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. హిందీలో “సహదేవ్” అనే టైటిల్ తో “ఈగల్” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ పోస్ట్ పోన్ కాబోతుందంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ ఓ పోస్టర్ ను సైతం రిలీజ్ చేశారు.

మరోవైపు ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. జీరో కట్స్ తో ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు సెన్సార్ బోర్డు వారు. అయినప్పటికీ ఈ సినిమా ఇప్పటిదాకా ఎలాంటి థియేట్రికల్ లేదా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను క్లోజ్ చేయలేకపోవడంతో నిర్మాత భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి “ఈగల్” మూవీని పోస్ట్ పోన్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఈ మూవీని సొంతంగా రిలీజ్ చేయబోతున్నారని అన్నారు.

- Advertisement -

మరోవైపు ప్రస్తుతం సంక్రాంతి బరిలో భారీ పోటీ నెలకొనడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వాయిదా వేయమంటూ నిర్మాతను ఒప్పించారనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే విషయంపై రవితేజ అభిమానుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ మొండి మోతుబరి తన మనసును మార్చుకున్నాడని, అందుకే “ఈగల్’ థియేటర్లను జనవరి 14న రిలీజ్ కాబోతున్న నాగార్జున “నా సామి రంగ” మూవీకి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు “ఈగల్” టీం ప్రమోషన్స్ విషయంలో సైలెంట్ గా ఉంది. దీంతో ఈ మూవీ పోస్ట్ పోన్ కాబోతోంది అనే వార్తలకు బలం చేకూరినట్టుగా అయింది. ఇక ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ విషయంలో ఇలా డైలమా కొనసాగుతోంది. మరి ఈ పుకార్లకు మేకర్స్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు