Personality Development: ఈ తప్పులు చేస్తే అందరూ మీ నుంచి దూరంగా పారిపోతారు జాగ్రత్త

సాధారణంగానే కొంతమందిని చూస్తే దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు ప్రవర్తించే తీరు అలా ఉంటుంది. మరి కలిసిన వెంటనే మన మీద గౌరవాన్ని పోగొట్టేలా చేసే ఆ ప్రవర్తన, లక్షణాలు ఏంటి? అంటే…

1. చేయని పనులకు క్రెడిట్ తీసుకునే వారిని ఎవ్వరూ గౌరవించరు. ఎందుకంటే అప్పటికి ఆ క్రెడిట్ మీకు సంతోషాన్ని ఇచ్చినా, ఎప్పుడో ఒకసారి నిజం అనేది బయటపడుతుంది. అప్పుడు మీరు చెప్పిన అబద్ధం వల్ల అప్పటిదాకా అందరికీ మీ మీద ఉన్న గౌరవం అంతా నాశనం అయిపోతుంది. ఇక ఎవరో చేసిన పనికి మీరు ప్రయోజనం పొందాలి అనుకోవడం మిమ్మల్ని అనుమానించేలా చేస్తుంది.

2. వెంటనే అభిప్రాయాన్ని మార్చుకునే వారు కూడా ఇదే లిస్టులోకి వస్తారు. మీ సొంత అభిప్రాయాలకు విలువ నివ్వకుండా అవతలి వ్యక్తుల అభిప్రాయాన్నిబట్టి మీ మనసు మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరో ఏదో చేశారు కాబట్టి దాన్నే మీద కూడా చేయాలనుకోవడం అవివేకం అవుతుంది.

- Advertisement -

3. మోసం, నమ్మకద్రోహం చేసే వ్యక్తులకు ఎలాంటి విలువ గౌరవం ఉండదు. కారణాలు ఏవైనాప్పటికీ జీవితంలో ఏదో ఒక సమయంలో అలాంటి పనులు చేయాల్సి వస్తుంది. కానీ ఆ విషయం మిమ్మల్ని నమ్మిన వ్యక్తికి తెలిస్తే మీ పట్ల ఉన్న గౌరవం అంతా కోల్పోతారు.

4. అవతలి వారిని నవ్వించగలడం అనేది ఒక వరం. కానీ దాన్ని తప్పుగా వాడడం వల్ల మీరంటే ఎవరికీ ఇష్టం లేకుండా పోవచ్చు. ప్రతి ఒక్కరు తమ తమ స్టైల్స్ లో జోక్స్ వేస్తూ ఉంటారు. కానీ మీరు వేసే జోక్ సెటైరికల్ గా ఉండి, కారణం లేకుండా అవతలి వారి వ్యక్తిత్వం, ఉద్యోగం, లేదా వారి రూపాన్ని కించపరిచే విధంగా ఉంటే మిమ్మల్ని చూసి దూరంగా పారిపోతారు. పైగా అప్పటిదాకా మీ మీద ఉన్న గౌరవం అంతా గాల్లో కలిసిపోతుంది.

5. ఇక పెద్దలను గౌరవించాలి అనే విషయం మనం చిన్నప్పటినుంచే చదువుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది దానిని పాటించరు. బయట ఎక్కడైనా ఉన్నప్పుడు లేదా స్నేహితుల ముందు మీ తల్లిదండ్రులను మీరు ఎగతాళి చేయడం లేదా అగౌరవపరచడం వంటివి చేస్తే మిమ్మల్ని ఒక్కరు కూడా గౌరవించరు. ఎందుకంటే ఈరోజు నీ ఫ్యామిలీనే నువ్వు ఇంత తక్కువ చేసి మాట్లాడితే తన ఫ్యామిలీ గురించి కూడా ఎంత దారుణంగా మాట్లాడతావో అని ఆలోచిస్తారు అవతలి వారు.

6. ఇక మనసులో మన నుంచి దూరంగా పారిపోయేలా చేసే అలవాట్లలో ఒకటి అవతలి వ్యక్తులను చిన్నచూపు చూడడం. తమను తాను గొప్పగా భావించి అవతలి వ్యక్తులను కించపరిచే విధంగా చూసే వారిని ఎవరు గౌరవించరు. ఇక అవసరమైనప్పుడు అందుబాటులో ఉండని స్నేహితులను కూడా ఎవరు ఇష్టపడరు. మీ ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడని తెలిసి కూడా మీరు అతనికి సహాయం చేయడానికి వెనకడుగు వేస్తే మీ గౌరవాన్ని పోగొట్టుకున్నట్టే.

7. ఇక ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు కేవలం మీ గురించి మాత్రమే మాట్లాడండి. మీ కళ్ళ ముందు లేని వారి గురించి మాట్లాడడం, లేదా వాళ్ల గురించి గాస్ క్రియేట్ చేయడం అనేది మిమ్మల్ని అవతలి వ్యక్తి ఆ గౌరవంగా చూసేలా చేస్తుంది. చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకోకపోవడం కూడా అందులో భాగమే. నిజానికి ఇతరులకు గౌరవాన్ని దక్కించుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా కేవలం మంచి వ్యక్తిగా ఉండడం, వీలైనంతవరకు సహాయం చేయగలిగితే చాలు. ఈ రెండు గుణాలు మీలో ఉంటే ప్రజలు మిమ్మల్ని మరింతగా గౌరవిస్తారు అని గుర్తుపెట్టుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు