Deepika Padukone: హమ్మయ్య.. పదేళ్ల నిరీక్షణకు క్లారిటీ ఇచ్చిందిగా..!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో నటి దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ జంట కూడా ఒకటనే చెప్పాలి. వీరిద్దరూ తమ సినీ కెరియర్ లో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్నో టాలీవుడ్ , బాలీవుడ్ జంటలు వివాహమైన కొద్ది రోజులకే శుభవార్త చెబుతూ అభిమానులను సంతోష పరుస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరు రిలేషన్షిప్ లో ఉండి పది సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ తల్లిదండ్రులవుతున్నామని వెల్లడించలేదు. వాస్తవానికి ఆరేళ్ల రిలేషన్షిప్ లో ఉన్న వీరు 2018లో పెళ్లి చేసుకున్నారు..అయితే ఇప్పటివరకు మాతృత్వం గురించి దీపిక ఎక్కడ చెప్పలేదు.

కానీ దాదాపు పది సంవత్సరాల నిరీక్షణ తర్వాత మాతృత్వం పై మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కాఫీ విత్ కరణ్ షో కి హాజరు కాగా షోలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కరణ్ ప్రెసెంట్ చేశారు. ఈ ఫోటోలను, వీడియోలను చూసి అభిమానులు కూడా తమ సంతోషం వ్యక్తం చేయడమే కాదు ఎప్పుడు తల్లిదండ్రులవుతున్నారు అంటూ ప్రశ్నించారు కూడా.. ఇకపోతే తాజాగా దీనిపై దీపిక స్పందించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక మాట్లాడుతూ.. “ఖచ్చితంగా రణబీర్ , నేను పిల్లల కోసం చూస్తున్నాము.. మా సొంత కుటుంబాన్ని ప్రారంభించే రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాము” అంటూ తెలిపింది .మొత్తానికైతే తన సొంత కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి ఈ జంట ఆసక్తి కనబరిస్తున్నారని చెప్పవచ్చు.

ఇది విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్పాలని కూడా కోరుతున్నారు. ఇకపోతే షారుఖ్ ఖాన్ మన్నత్ సమీపంలో దీపిక, రణవీర్ తాజాగా ఒక విలాసవంతమైన బంగ్లాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. నగరంలోని ప్రముఖ ప్రదేశంలో ఈ విలాసవంతమైన ఇంటిని కలిగి ఉన్న మొదటి జంటగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరు విడివిడిగా తమ సినిమాల ద్వారా భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సోషల్ మీడియా ద్వారా.. పలు యాడ్స్ ద్వారా.. బిజినెస్ లు చేస్తూ కూడా భారీగా సంపాదించిన ఈ జంట ఇప్పుడు తమ రాబోయే పిల్లల కోసం సొంత కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి ఇలా విలాసవంతమైన బంగ్లాన్ని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపద్యంలో దీపిక ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు