Fitness Tips : జిమ్ కి వెళ్లకపోయినా ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చేయండి

Fitness Tips : ఈ బిజీ లైఫ్ లో ఫిట్‌గా ఉండాలంటే లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన రెండింటి విషయంలో కేర్ తీసుకోవడం అవసరం. శారీరకంగా చురుకుగా ఉండాలంటే ప్రతిరోజూ కొంత సమయం పాటు వ్యాయామం లేదా వాకింగ్ లాంటివి చేయాలి. అయితే ఫిట్ అనే మాట రాగానే చాలా మంది జిమ్ గురించి ఆలోచిస్తారు. అయితే కొంత మందికి జిమ్ కు వెళ్ళడానికి టైం కుదరకపోవచ్చు. పైగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఫిట్‌గా ఉండేందుకు కొన్ని అలవాట్లు అలవర్చుకుంటే వర్కవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. వ్యాయామం చేయడానికి సమయం దొరకని వారికి కూడా ఈ అలవాట్లు బాగా ఉపయోగపడతాయి. మరి జిమ్‌కి వెళ్లకుండానే ఫిట్‌గా ఉండాలంటే ఇంట్లో ఏయే యాక్టివిటీస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ వాకింగ్‌కు వెళ్లడం
మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం ప్రారంభించండి. రోజూ వాకింగ్ చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. నడక వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

స్కిప్పింగ్ బెటర్ ఆప్షన్
దూకడం కూడా మంచి వ్యాయామమే. స్కిప్పింగ్ బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయ పడుతుంది. ఫిట్‌గా ఉండాలంటే బరువు తగ్గాల్సిందే. కాబట్టి ఇంట్లో ప్రతిరోజూ కనీసం 10-15 నిమిషాలు స్కిప్పింగ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

- Advertisement -

ప్రతిరోజూ యోగా చేయండి:
మీరు బరువు పెరగడం, బలహీనమైన ఫిట్‌నెస్‌తో ఇబ్బంది పడడం లాంటివి జరిగితే ప్రతిరోజూ యోగా చేయడం ప్రారంభించండి. దీంతో బరువు తగ్గి ఆరోగ్యంగా తయారవుతారు. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి యోగా సహాయప డుతుంది. అయితే నిపుణులను సంప్రదించిన తర్వాతే యోగా, వ్యాయామం చేయాలి అని గుర్తు పెట్టుకోండి.

బిజీగా ఉండండి
ఫిట్‌గా ఉండటానికి చురుకుగా ఉండటం ముఖ్యం. మీకు వ్యాయామం చేయడానికి సమయం లేకుంటే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం ద్వారా ఫిట్‌ గా ఉండండి. దీని కోసం మీరు కొన్ని ఇంటి పని చేయవచ్చు. లేదా ఇంట్లో కాసేపు నడవండి. కొంత సమయం పాటు డ్యాన్స్ కూడా చేయవచ్చు.

శక్తి కోసం నిద్ర
మీరు రోజంతా చురుకుగా ఉండాలనుకుంటే రాత్రి నిద్ర పోవడం చాలా ముఖ్యం. రోజూ 7-8 గంటలు నిద్రపోవడం అవసరం. లేదంటే మీ మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడి ఒత్తిడి పెరుగుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం
ఫిట్‌నెస్ కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం వల్ల డిప్రెషన్, స్ట్రెస్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

మంచి సంగీతాన్ని వినండి
సంగీతం శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేయడంలో సహాయ పడుతుంది. ఒత్తిడి, నిరాశ లక్షణాలను తగ్గిస్తుంది. మీకు నచ్చిన పాటలను వింటే మీ మానసిక స్థితి మెరుగు పడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు