Lifestyle : ఈ పిచ్చి పనులు చేస్తే అబ్బాయిలు లోన్లీగా ఫీల్ అవుతున్నారని అర్థం

ఎంత దగ్గరగా ఉన్నా సరే అవతలి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. వాళ్లు సంతోషంగా ఫీల్ అవుతున్నారా? లేక అలా ఉన్నట్టు నటిస్తున్నారా? అనేది అర్థం చేసుకోవడం కష్టతరం. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ గజిబిజి లైఫ్ లో ఒంటరితనం అనేది చాలామందిని వేధిస్తోంది. బయటకు చెప్పనంత మాత్రాన వాళ్లు ఒంటరితనంతో ఫీల్ అవ్వట్లేదు అని అర్థం కాదు. ముఖ్యంగా అబ్బాయిలు లోన్లీగా ఫీల్ అయితే కొన్ని పిచ్చి పనులు చేస్తారట. సైకాలజీ నిపుణుల ప్రకారం ఒంటరితనం అంటే జనాల మధ్య ఉండడానికి అసౌకర్యంగా ఫీల్ అవ్వడం. వాళ్ల ప్రవర్తనను బట్టి అబ్బాయిలు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇక కొన్ని పిచ్చి పనులు చేశారు అంటే వాళ్ళు ఖచ్చితంగా లోన్లీగా ఫీల్ అవుతున్నారని అర్థం. మరి ఆ పిచ్చి పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోవడం అంటే ఆ వ్యక్తి లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అనడానికి సంకేతం. సాధారణంగా చిన్నప్పటి నుంచి టీనేజ్ వరకు అబ్బాయిలకు ఫ్రెండ్స్ బాగానే ఉంటారు. ఒకరితో ఒకరు అన్ని విషయాలను పంచుకుంటారు. కానీ ఒక ఏజ్ వచ్చాక అలా ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటే వాళ్లపై సమాజం గే అనే ముద్ర వేస్తుందేమోననే భయంతో ఫ్రెండ్స్ కు దూరమవుతారట.

ఎక్కువగా మందు తాగడం, డ్రగ్స్ కు బానిసవ్వడం వంటివి చేశారు అంటే కచ్చితంగా ఆ అబ్బాయి ఒంటరితనంతో బాధపడుతున్నాడు అని అర్థం. ఆల్ ఓన్లీ ఫీలింగ్ తప్పించుకోవడానికి మత్తు పదార్థాలకు అబ్బాయిలు బానిసలు అవుతారని మానసిక నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

మగవాళ్ళు తమ ఫీలింగ్స్ ను బయట పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడరు. పైగా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ ఎక్కువ కాలం ఒంటరిగా గడిపితే ఇతర భక్తులతో కమ్యూనికేట్ చేయడం వారికి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే తన ఫీలింగ్స్ ను పంచుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. అబ్బాయిలు ఎవరైనా లోన్లీగా ఫీల్ అయితే ఈ పరిస్థితి ఎదురవుతుంది.

ఇక లోన్లీ నెస్ ను దూరం చేసుకోవడానికి సోషల్ మీడియాలో మునిగిపోతారు. అంతేకాకుండా నకిలీ సంబంధాల కోసం ఆరాటపడతారు. ఉదాహరణకు ప్రాస్టిట్యూట్స్ దగ్గరకు వెళ్లడం వంటివి. ఒక అధ్యయనం ప్రకారం 18 శాతం మంది అబ్బాయిలకు ఒక్క క్లోజ్ ఫ్రెండ్ కూడా లేదట. అయితే 32 శాతం మందికి మాత్రం ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం లేరట.

మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటిలో ఒకటి లోన్లీగా ఫీల్ అవ్వడం. సాధారణంగా గర్ల్ ఫ్రెండ్ ఉన్న అబ్బాయిలు తాము తోపు అన్నట్టుగా వ్యవహరిస్తారు. దీంతో గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలు వాళ్ళ కంటే తమను తాము తక్కువ చేసుకుని ఫీల్ అవుతూ ఉంటారు.

ఇక జనాలతో కలవడానికి లోన్లీగా ఫీల్ అయ్యే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడరు. నిరాశగా ఫీల్ అవుతూ, అందరితో కలిసి పోవడానికి ఇబ్బంది పడతారు. ఇతరులతో సరదాగా మాట్లాడలేరు.

ఇక పెళ్లయిన అబ్బాయిలు కూడా ఈ లిస్టులో ఎక్కువగా ఉన్నారు. పెళ్లి, భార్య, పిల్లలు వంటి బాధ్యతలను తలకెత్తుకోవడంతో వాళ్లకు పెద్దగా టైం ఉండదు. ఏదేమైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే సైకాలజిస్ట్ ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు ఉన్నాయి అంటే ఆ అబ్బాయిలు చాలా కాలం నుంచి లోన్లీనెస్ తో బాధపడుతున్నారు అని అర్థం.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు