Naga Chaitanya : గర్ల్ ఫ్రెండ్ తో దొరికిపోయా

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనదైన శైలిలో రాణిస్తున్నాడు. నాగార్జున వారసుడిగా అక్కినేని అభిమానులను అలరిస్తూ ఆ లెగసీని కొనసాగిస్తున్నాడు. చూడటానికి చాలా కూల్ గా, సైలెంట్ గా ఉండే నాగచైతన్య పెళ్లి జీవితం ఇబ్బందుల్లో పడడం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత – నాగచైతన్య, నాలుగేళ్లు తిరగకుండానే విడిపోయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత నాగ చైతన్య తన కెరీర్ ట్రాక్ లో పెట్టడానికి రెడీ అవుతున్నాడు. దానికి తగినట్టు సినిమాలు కూడా చేస్తున్నాడు.

చైతు ఇటీవలే “లాల్ సింగ్ చద్దా” చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, చైతన్యకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నాడు చైతు. ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య తన జీవితంలో సమంత కంటే ముందు మరో అమ్మాయిని ఇష్టపడినట్లు తెలిపాడు. ఓ రైల్వే స్టేషన్ సమీపంలో కారు వెనక సీట్లో తన గర్ల్ ఫ్రెండ్ ను కిస్ చేస్తుండగా.. పోలీసులకు దొరికిపోయానని చెప్పుకొచ్చాడు.

“నా గర్ల్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతున్న సమయంలో పోలీసులకు దొరికిపోయా. అలా పోలీసులకు పట్టుపడటం నాకు తప్పుగా ఏమీ అనిపించలేదు. నేను చేస్తుంది ఏమిటో నాకు తెలుసు” అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. చైతన్య రివీల్ చేసిన ఈ సీక్రెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు