Tollywood : ఈ వారం రాబోయే సినిమాలు

ప్రతి వారం థియేటర్ లో, ఓటీటీలో కొత్త సినిమాలు వస్తుంటాయి. ప్రస్తుతం థియేటర్ లలో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఆగస్టులో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో మూడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. జూన్, జూలై నెలలో థియేటర్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇప్పుడు ఆగస్టులో వచ్చిన సినిమాలతో థియేటర్ ల ముందు పూర్వ వైభవం వచ్చింది. అయితే ఈ వారం ఇటు థియేటర్ లో, అటు ఓటీటిలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారం థియేటర్ లలో వచ్చే సినిమాలు..
ముందుగా ఈ నెల 18న ధనుష్, రాశిఖన్నా, నిత్యా మేనన్ నటించిన ‘తిరు’ సినిమా రాబోతుంది. ఆర్. మిత్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన కూడా వచ్చింది. అలాగే ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న ‘తీస్ మార్ ఖాన్’ అనే చిత్రం ఈ నెల 19న రాబోతుంది. అలాగే బుల్లితెర స్టార్ సుధీర్, సునీల్, అనసూయ ముఖ్య పాత్రలో వస్తున్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ఇది కూడా 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అలాగే ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు వెబ్ సిరీస్ లు..
తమిళ్ రాకర్స్ అనే వెబ్ సిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ సోని లివ్ లో ఈ నెల 19 నుంచి ప్రసారం కాబోతుంది. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘హైవే’ అనే చిత్రం కూడా 19 నుండే ఆహాలో స్ట్రిమింగ్ కాబోతుంది. వీటితో పాటు ఆగస్టు 17న షీ హల్క్ అనే హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ డిస్పీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతుంది. దీంతో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలో రాబోతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు