Fan War : శృతి తప్పింది.. అతి పెరిగింది

స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ట్రోల్స్ రావడం, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరగడం కొత్తేమీ కాదు. ఇలాంటి ఘటనలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సార్లు చూశాం. ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన అభిమానులు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికగా రోజుల తరబడి, ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకునే వారు. ఆయా హీరోలు బాగానే ఉన్నా, అభిమానుల మధ్య మాత్రం ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉండేది. అయితే, సోమవారం నుంచి సోషల్ మీడియాలో జరుగుతన్న ఫ్యాన్ వార్ ప్రస్తుతం టాలీవుడ్ లో గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తుంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోల లిస్ట్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ మొదటి వరసలో ఉన్నారు. వీళ్లు ఒకే కుటుంబం నుంచి వచ్చారు. కానీ, వీరి అభిమానులు మాత్రం ఈ స్టార్ ల మధ్య శత్రుత్వం ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నా, ఈ హీరోలకు గానీ, వాళ్ల ఫ్యామిలీకి గానీ ఎక్కువ ఇబ్బంది కలగలేదు. కానీ, సోమవారం నుంచి ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ఫ్యాన్ వార్ లో అత్యంత దారుణంగా హీరోల కుటుంబాలు టార్గెట్ అవుతున్నాయి. ఈ స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ ఒకరికి పోటీగా మరొకరు ట్వీట్లు వేస్తున్నారు.

సోమవారం స్టార్ట్ అయిన ఈ ఫ్యాన్ వార్.. ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు హ్యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో హ్యాష్ ట్యాగ్ పై 6.5 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. దీన్ని బట్టి సోషల్ మీడియాలో ఎంత రచ్చ నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారం అల్లు అర్జున్, రామ్ చరణ్ వరకు కూడా వెళ్లిందని టాక్. దీనిపై ఈ అగ్ర హీరోలు చాలా సీరియస్ గా ఉన్నారట. తమ ఫ్యాన్స్ తో ఈ వార్ ను వెంటనే ఆపాలని హెచ్చరించినట్టు తెలుస్తుంది. అయినా, ఈ వార్ తగ్గుముఖం పట్టడం లేదు.

- Advertisement -

హీరోలను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ ఫ్యాన్ వార్ కుటుంబాల వరకు వెళ్లడంతో నెటిజన్లు, కొంత మంది సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోల వ్యక్తిగత అంశాల గురించి, కుటుంబాల గురించి ఫ్యాన్స్ ఇలా ప్రస్తావించడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. అయినా, శృతి తప్పిన ఫ్యాన్స్ అతిని అపడం మాత్రం సాధ్యమవడం లేదు. ఈ వార్ తగ్గాలంటే ఈ స్టార్ హీరోలు కలిసి ఒక సంయుక్త ప్రకటన చేయాల్సి వస్తుందేమో.. చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు