Yash Raj Films: ధూమ్ 4 పై కన్నేసిన కుర్ర హీరో

Yash Raj Films

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ ధూమ్ ఫిలిం సిరీస్ గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ లో భాగంగా వివిధ ఇండస్ట్రీల నుంచి పలు సినిమాలు పాపులర్ అవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఒకప్పుడు ఈ ట్రెండ్ మొదలవక ముందే భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ పాపులరైంది ధూమ్ సిరీస్.

విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ధూమ్ ఫిలిం సిరీస్ నుంచి ఇప్పటి వరకు 3 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ధూమ్ మొదటి భాగంలో జాన్ అబ్రహం, పార్ట్ 2 లో హృతిక రోషన్, మూడవ చిత్రంలో అమీర్ ఖాన్ హీరోలుగా నటించారు. అయితే మూడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లక్ బస్టర్ విజయాన్ని సాధించాయి. ధూమ్ సిరీస్ లో భాగంగా చివరగా రిలీజైన ధూమ్ 3 సినిమా వచ్చి దాదాపు 10 సంవత్సరాల కావస్తోంది కానీ ఇప్పటి వరకు ధూమ్ 4 మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య షారుఖ్ ఖాన్ లేదా సల్మాన్ ఖాన్ ధూమ్ 4 సినిమా చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ ఫిలిం సిరీస్ పై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆదిలోనే ఆ చర్చలు ఆగిపోయాయి.

ఇక లేటెస్ట్ గా చూస్తే త్వరలోనే ధూమ్ 4 గురించి క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ధూమ్ సిరీస్ నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను త్వరలోనే అఫీషియల్ ప్రకటించబోతుందని తెలుస్తోంది. ఇటీవలనే ధూమ్ చిత్రాల దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య “ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ” పేరుతో హిందీలో ఒక సినిమాను చేసాడు. ఈ సినిమాలో విక్కీ కౌశల్, మానుషీ చిల్లర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. అయితే ఇటీవలనే ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న హీరో విక్కీ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ “విజయ్ ఆచార్య కథ చెప్తాను అనగానే.. ధూమ్ 4 సినిమా కథ చెప్పబోతున్నారు అని ఆసక్తిగా విన్నాను కానీ అది ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ కథ అని తరువాత తెలిసింది” అని మనసులో మాటను బయట పెట్టాడు విక్కీ కౌశల్. ఇక స్టేట్మెంట్ ను బట్టి చూస్తే ధూమ్ 4 ప్లానింగ్ దశలో ఉందని అర్థమవుతోంది. అలాగే ఒక వేళ అవకాశం వస్తే ధూమ్ 4 లో నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా విక్కీ కౌశల్ ఖచ్చితంగా నటిస్తాను అని చెప్పాడు. ఇక విక్కీ కౌశల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు