Mrunal Thakur : కొంపదీసి అల్లు శిరీష్ కి ఇచ్చి చేస్తారా.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గాసిప్స్ ఎంత త్వరగా చక్కర్లు కొడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరో, హీరోహిన్ ప్రేమించుకుంటున్నారు అంటే వాళ్లకంటే ముందు ఆడియన్స్ కి తెలుస్తుంది. ఎందుకంటే ఏమీ లేనప్పుడే ఏదో ఒకటి క్రియేట్ చేసి వదలటం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. అయితే రీసెంట్ టైమ్స్ లో ఎవరి ఊహకి అందకుండా ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉంటూ కూడా బయటకు తెలియకుండా ఒక జంట ఇండస్ట్రీలో  మెలిగింది.

వారు ఎవరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటలీలో పెళ్లికి సిద్ధమైన వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి.  బేసిగ్గా  సెలబ్రిటీస్ లవ్ స్టోరీస్ అని చాలా త్వరగా తెలుస్తాయి కానీ వీళ్లది మాత్రం ఎంగేజ్మెంట్ కి వారం రోజులు ముందు వరకు కూడా ఎవరికీ తెలియదు అని చెప్పొచ్చు.
ఈ పరిణామం వెనుక ఒక విషయం ఉంది.

కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన “సినిమా చావు కబురు  చల్లగా” ఈ సినిమాను గీత పిక్చర్స్ 2 పైన నిర్మించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ … లావణ్య త్రిపాఠి గురించి కొన్ని విషయాలు చెబుతూ ఇక్కడే ఒక తెలుగు కుర్రాడిన చేసుకుని సెటిల్ అయిపో అన్నారు.

- Advertisement -

అయితే ఏ ముహూర్తం అలా చెప్పుకొచ్చారో  గాని ఇక్కడ వరుణ్ తేజ్ ను  చేసుకొని  రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం ఇంకొక విషయం గురించి కూడా అల్లు అరవింద్ ఇదే విషయాన్ని చెప్తున్నారు. సీతారామం సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.   ప్రస్తుతం మృణాల్ ఠాకూర్  విజయ్ దేవరకొండ తో “ఫ్యామిలీ స్టార్” సినిమా చేస్తుంది. ఆమె కూడా ఒక తెలుగు కుర్రాడిని చేసుకుంటుందని నా గెస్ అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఈ స్టేట్మెంట్ తో కొందరు కొంపదీసి అల్లు శిరీష్ ఇచ్చి చేసేస్తారా.. అంటూ ట్రోలింగ్స్ మొదలుపెట్టారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు