Akhanda 2 : గీతానా, 14 రీల్సా? నిర్మాతల కన్ఫ్యూజన్

నరసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత ప్రత్యేకమైన మూవీ “అఖండ”. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. కరోనా టైంలో వెలవెలబోతున్న థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించి కాసుల వర్షాన్ని కురిపించింది ఈ మూవీ. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూడో మూవీ “అఖండ”కు సీక్వెల్ కూడా ఉంటుందన్న విషయాన్ని మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కుతుంది అన్న విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా “అఖండ 2″కు నిర్మాత ఎవరు అన్న విషయం నందమూరి అభిమానులను కన్ఫ్యూజన్లోకి నెట్టేసింది.

వాస్తవానికి “అఖండ” సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. సాధారణంగా సీక్వెల్స్ తీసినప్పుడు మొదటి భాగంలో భాగమైన నిర్మాతలే నిర్మిస్తారు. కాబట్టి సీక్వెల్ కు కూడా మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆ ప్రాజెక్టులో భాగం కావాలి అనుకుంటే రవీందర్ రెడ్డి తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం “అఖండ 2” నిర్మాత విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ముందుగా గీత ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని వార్తలు రాగా, ఇప్పుడేమో 14 రీల్స్ బ్యానర్ పై “అఖండ 2” తెరకెక్కనుందని టాక్ మొదలైంది. దీంతో అసలు “అఖండ 2″కు అసలు నిర్మాతలు ఎవరు అన్న విషయంపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ మొదలైంది.

కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ మూవీ ఉంటుందనే విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు. అయితే ముందుగా అందరూ ఈ ప్రాజెక్టులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తాడని అనుకున్నారు. కానీ ఆ సినిమా అల్లు అర్జున్ తో కాదు బాలయ్యతో బోయపాటి “అఖండ 2″ను తెరకెక్కించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా గీత ఆర్ట్స్ కాదు, “అఖండ 2″ను నిర్మించేది 14 రీల్స్ బ్యానర్ నిర్మాతలు అని ప్రచారం జరుగుతుంది. కానీ తాజా సమాచారం ప్రకారం 14 రూల్స్ బ్యానర్ పై బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో సినిమా రావడం అయితే నిజమే. కానీ అది “అఖండ 2” కాదని, రాజకీయ నేపథ్యమున్న సినిమా అని తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుతం బోయపాటి గీత ఆర్ట్స్ క్యాంప్ లో, బాలయ్య మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి “అఖండ 2″పై అధికారిక ప్రకటన వచ్చేదాకా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాత్రమే. మరి గీత ఆర్ట్స్ తో బోయపాటి చేస్తున్న సినిమా ఏంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య, బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు