Lal Salaam : ఇది ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్… రజినీకాంత్ గొంతు మారింది!

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు. తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన “లాల్ సలాం” ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా రజనీకాంత్ గొంతు మారిపోయింది. అసలు ఆ వాయిస్ రజినీకాంత్ కు సెట్ కాలేదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. అసలే ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఇప్పుడేమో దానికి తోడు అన్నట్టుగా రజినీకాంత్ వాయిస్ ఆయన అభిమానులను నిరుత్సాహపరుస్తుంది.

రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన “లాల్ సలాం” మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు అసలు లేవనే చెప్పాలి. ఐదేళ్ల తర్వాత ఐశ్వర్య మళ్ళీ ఈ సినిమా కోసం మెగా ఫోన్ పట్టుకుంది. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే పవర్ ఫుల్ పాత్రను పోషించారు రజనీకాంత్. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. ఒక క్రికెట్ మ్యాచ్ రెండు గ్రామాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీసింది? తర్వాత అది మత ఘర్షణగా ఎలా మారింది? వీటిని మొయిద్దీన్ ఎలా చల్లార్చారు? అనేదే స్టోరీ. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ రజనీకాంత్ వాయిస్ మారడం ఆయన అభిమానులకు నచ్చలేదు.

మరికొన్ని గంటలో థియేటర్లలోకి రాబోతున్న “లాల్ సలాం” సినిమాకు అసలే మాత్రం హైప్ లేదు. తమిళంలో అంతంత మాత్రంగానే బజ్ ఉన్నప్పటికీ, తెలుగులో అంచనాలు నిల్ అని చెప్పాలి. చిత్ర బృందం ప్రమోషన్స్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న రజినీ తెలుగు అభిమానులకు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మరింత నిరాశను మిగిల్చింది. ఈ ట్రైలర్లో రజనీకాంత్ పాత్రకు సాయి కుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కానీ దశాబ్దాలుగా రజనీకాంత్ వాయిస్ కు సింగర్ మనో డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. జనాలు కూడా ఎక్కువగా ఆయన వాయిస్ కే అలవాటు పడ్డారు. మనో వాయిస్ వినగానే రజినీకాంత్ గుర్తొస్తారు. కానీ ఇప్పుడు సాయి కుమార్ మనో ప్లేస్ ను రీప్లేస్ చేయడంతో, ఆయన వాయిస్ ను రజనీకాంత్ వాయిస్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒకవేళ సినిమా కంటెంట్ ఆకట్టుకునే రేంజ్ లో లేకపోతే ఈ డబ్బింగ్ మార్పు మూవీ డిజాస్టర్ కావడానికి మరో కీలకమైన అంశంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ మార్పుకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు