Gangs of Godavari: “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రిలీజ్ మళ్ళీ వాయిదా… అసలేం జరుగుతోంది?

మాస్ కా దాస్ విశ్వక్సేన్ కు మరోసారి “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రిలీజ్ విషయంలో నిరాశ తప్పలేదు. పలు వాయిదాల అనంతరం ఈ మూవీని మార్చ్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మరోసారి వాయిదా పడగా, అదే తేదీకి విశ్వక్సేన్ హీరోగా నటించిన మరో మూవీ “గామి” రిలీజ్ కాబోతోంది. మరి “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఇప్పుడు మళ్లీ వాయిదా పడడానికి కారణం ఏంటి? ఇంతకీ ఈ మూవీ విషయంలో ఏం జరుగుతోంది? అంటే….

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఎన్నిసార్లు వాయిదా పడిందంటే…
విశ్వక్సేన్ హీరోగా, రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా ఫేమ్ చైతన్య కృష్ణ దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ మూవీని ముందుగా డిసెంబర్ 8న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. పైగా అదే వారంలో నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు రిలీజ్ కావడం, వాటితో పాటు డిసెంబర్ 22న సలార్ మూవీ రిలీజ్ ఉండడంతో “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” వాయిదా పడింది. తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ సమయంలో “ఈగల్” అడ్డొచ్చింది. దీంతో ఎట్టకేలకు మార్చ్ 8న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత మార్చి మూడవ వారంలో ఈ మూవీనీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరిగింది.

అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదాకు కారణం ఏంటి?
“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు అవసరమైన సమయం లేకపోవడంతో మార్చ్ 8 నుంచి పోస్ట్ పోన్ చేయక తప్పలేదట మేకర్స్ కి. మరోవైపు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న యువన్ శంకర్ రాజా ఇంట్లో ఇటీవలే సోదరి భవతారిని అకాల మరణం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఆ విషాదంలో నుంచి బయటకు వచ్చి యువన్ శంకర్ రాజా మళ్ళీ సంగీతంపై కాన్సన్ట్రేట్ చేయడానికి, రీ రికార్డింగ్ కు సమయం అవసరం కావడం మరో కారణం అంటున్నారు. మొత్తానికి “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రిలీజ్ డేట్ ను “గామి”తో రీప్లేస్ చేస్తున్నాడు విశ్వక్సేన్.

- Advertisement -

“గామి” కథ…
విద్యాధర దర్శకత్వం అందిస్తున్న “గామి” మూవీలో విశ్వక్సేన్ అఘోరాగా ఇంటెన్స్ పాత్రను పోషిస్తున్నారు. చాందిని చౌదరి, అభినయ, హారిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉన్న “గామి”కి ఎట్టకేలకు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” వాయిదా వల్ల మోక్షం దక్కుతోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు