Bigg Boss 7: ఇచ్చిన మాట మరచిన రైతుబిడ్డ.. అసహనంలో ఫ్యాన్స్..!

యూట్యూబర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత రైతుబిడ్డను అంటూ బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్నారు పల్లవి ప్రశాంత్.. అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్న ఈయన టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ అంతా పేద రైతులకు పంచుతానని తెలిపారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు కనిపించడం లేదు.. కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ విన్నర్గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సీరియల్ నటుడు అమర్దీప్ – పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీ పడగా ప్రేక్షకుల ఓట్లతో పల్లవి ప్రశాంత్ టైటిల్ సొంతం చేసుకున్నారు.

ఇకపోతే విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ.35 లక్షల ప్రైజ్ మనీ, డైమండ్ నెక్లెస్ తో పాటు ఒక కారును కూడా బహుమతిగా అందుకున్నాడు. ముఖ్యంగా టాస్క్, గేమ్లలో సత్తా చాటాడు. పైగా రైతుబిడ్డ ట్యాగ్ కూడా ఇతడికి బాగా కలిసి వచ్చింది. ఒకవేళ తాను టైటిల్ విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు పంచి పెడతానని హామీ ఇచ్చాడు.. బిగ్ బాస్ షో వేదికగా ఈ మాట ఎన్నోసార్లు చెప్పాడు.. చెప్పినట్టే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచి.. తాను గెలుచుకున్న డబ్బులను మరి పేద రైతులకు పంచాడా? లేదా? అన్న సందేహాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి..

షో ముగిసి దాదాపు రెండు నెలలు అవుతుంది అయినా పల్లవి ప్రశాంత్ పేద రైతులకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు.. అంతే కాదు తాను సహాయం చేసిన వీడియోలను షేర్ చేస్తానని.. పంచిన ప్రతి రూపాయికి లెక్క చెబుతానని కూడా పల్లవి ప్రశాంత్ చెప్పాడు.. కానీ ఆ సూచనలేవీ ఇప్పుడు కనిపించడం లేదు. పైగా అతడు పలు వేడుకలలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.. సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నాడు.. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.. అంతేకాదు తన స్పై బ్యాచ్ అయిన శివాజీ , ప్రిన్స్ యావర్లతో పార్టీలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడే తప్ప పేద ప్రజలకు పంచి పెడతానన్న డబ్బును ఏం చేశాడో అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒకసారి లగ్జరీకి అలవాటు పడ్డాక ఎండలో చాకిరి చేయడం అంత సులభం కాదు కదా.. ఇకపోతే రైతుబిడ్డ ట్యాగ్ బిగ్బాస్ వరకే పరిమితమని.. ఇక పల్లవి ప్రశాంత్ వ్యవసాయం కూడా చేయకపోవచ్చు అని కూడా అంటున్నారు.. మొత్తానికైతే బిగ్ బాస్ లోకి రావాలన్న కలను నెరవేర్చుకొని ప్రేక్షకులను పిచ్చి వాళ్లను చేశాడు అంటూ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరి దీనిపై పల్లవి ప్రశాంత్ ఏదైనా స్పందిస్తారామో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు