Bandla Ganesh: బండ్లన్నకి గురూజీకి మధ్య ఏం జరిగింది – ట్విట్టర్లో రచ్చకి కారణం ఏంటి..?

నిర్మాత బండ్ల గణేష్ నిన్నటి నుండి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై వివాదాస్పద ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. గురూజీ తలచుకుంటే భార్య భర్తలనైనా విడగొడతాడని, పవన్ కళ్యాణ్ ని కలవాలంటే, ముందు కాస్ట్లీ గిఫ్ట్ తో త్రివిక్రమ్ ని కలవాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీంతో బండ్ల గణేష్ ట్వీట్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. అసలు త్రివిక్రమ్ మీద బండ్ల కి అంత కోపం ఎందుకు, ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడెందుకు శత్రువులుగా మారారు అన్న చర్చ విపరీతంగా జరుగుతోంది సోషల్ మీడియాలో. ఈ కథ తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అవి బీమ్లా నాయక్ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు, అప్పట్లో సినిమా సెట్స్ కి వెళ్లిన బండ్ల పవన్ తో ఫోటో దిగి నా ‘దేవర’ అంటూ క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశాడు.
అందరు అనుకున్నట్టుగానే ఆ సమయంలో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో తన నెక్స్ట్ సినిమా ఉండనుందని, అందుకోసం దేవర అన్న టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించానని సన్నిహితులతో పంచుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇందుకు కారణం గురుజీనే అని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత బీమ్లా నాయక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కి బండ్లకి ఆహ్వానం అందకపోవటం, ఆ సమయంలో త్రివిక్రమ్ ని తిడుతున్న బండ్ల వాయిస్ రికార్డింగ్ బయటకు రావటంతో వినిపిస్తున్న టాక్ నిజమే అన్న అభిప్రాయం ఏర్పడింది.
అయితే కొన్నాళ్ళకు ఆ ఇష్యూ మరుగున పడింది, అందరూ మరిచిపోయారు. తాజాగా మళ్లీ ఏం జరిగిందో ఏమో కానీ బండ్ల మళ్లీ గురూజీ పై విరుచుకపడ్డాడు. అయితే ఇటీవలి కాలంలో త్రివిక్రమ్ తీరు గమనిస్తే, బండ్ల ఆవేదనలో వాస్తవం ఉందని అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో గురూజీ ఇన్వాల్వ్ అవ్వటం, డైరెక్టర్ ని కూడా పక్కన పెట్టి అన్నీ తానై సినిమాను నడిపించటం వంటివి చుస్తే పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగుని గురూజీ డిసైడ్ చేస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోంది. మరి, బండ్ల గణేష్ ట్వీట్ తో మళ్ళీ తెరపైకి వచ్చిన ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో, ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.
For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు