Uday Kiran: వారి వల్లే.. పాన్ ఇండియా స్టార్ కాకుండా ఉదయ్ కిరణ్ చనిపోయాడా ?

హీరో ఉదయ్ కిరణ్ గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుస హిట్లతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ముఖ్యంగా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉదయ్ కిరణ్ పేరు సంపాదించుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా మారారు.
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి బళా అనిపించుకున్నారు. ఆ తర్వాత చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను సినిమాలో నటించి ఒక్కసారిగా ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. అలా ఉదయ్ కిరణ్ ఎంత స్పీడ్ గా స్టార్ డం తెచ్చుకున్నారో అంతే స్పీడ్ గా డౌన్ ఫాల్ అయ్యారు. ఇది ఇలా ఉండగా… మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే ఉదయ్ కిరణ్ కు, మెగాస్టార్ చిరంజీవి కూతురుతో పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది. అన్ని ఓకే అయ్యాక వారి వివాహం క్యాన్సిల్ అయింది.
అయితే అదే సమయంలో బయటికి వచ్చి మీడియా ముందు తన వల్ల పెళ్లి క్యాన్సిల్ కాలేదని ఉదయ్ కిరణ్ చెప్పి ఉంటే ఆయన పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది. కానీ ఉదయ్ కిరణ్ ఆ పని చేయలేకపోయాడు. దీంతో అందరి ముందు ఉదయ్ కిరణ్ దోషిగా మిగిలిపోయాడు. ఆ తరుణంలోనే స్టార్ డైరెక్టర్లు కూడా అతన్ని పట్టించుకోలేదు. అటు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా దారుణంగా తయారయ్యాయి. ఇక ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు