Vithika: చేతిలో 5 వేలు కూడా లేని స్థితిలో వరుణ్ – కన్నీళ్లు పెట్టుకుంటూ..?

వరుణ్ సందేశ్.. పరిచయం అక్కర్లేని పేరు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఏ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. ఏమైంది ఈవేళ, మరో చరిత్ర సినిమాలు పరవాలేదనిపించాయి. అయితే మరోచరిత్ర మాత్రం అనుకున్నంత రేంజ్ లో హిట్ కాలేదు.

ఆ తరువాత వరుణ్ సందేశ్ – వితిక కలిసి నటించడం, ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో యూఎస్ కి వెళ్లిన వీరిద్దరూ కొద్ది రోజులకే తిరిగి వచ్చేశారు. వితిక, వరుణ్ సందేశ్ బిగ్ బాస్ మూడో సీజన్ లో కనిపించి పాపులర్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల ఓ గేమ్ షోలో పాల్గొన్న వీరిద్దరూ యూఎస్ వెళ్లిన సమయంలో ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పుకొచ్చారు. యుఎస్ వెళ్లిన తర్వాత అక్కడ ఓ బిజినెస్ పెట్టాలని ఆలోచన చేశారట. కానీ అది అక్కడ వర్కౌట్ కాకపోవడంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయారట. చేతిలో కనీసం 5 వేలు కూడా లేని స్థితికి వచ్చేసారట. కానీ తమకి ఎప్పుడూ కూడా కార్లు కొనాలి, బంగ్లాలు కొనాలి అనే కోరికలు ఉండేవి కావట. తను సంతోషంగా ఉంటే చూడాలని వరుణ్ కోరిక అంటూ చెప్పుకొచ్చింది వితిక.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు