Samantha : సీక్రెట్ గా ఆ పనులు చేస్తున్న సమంత ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. మొదటి సినిమాలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం మనకి తెలిసిందే.

ఆ తర్వాత కొంతకాలంగా మరోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బందిపడుతుంది సమంత. అనారోగ్యంతో పోరాడుతున్న సమంత తిరిగి బలంగా నిలదొక్కుకుంటుంది. తన ట్రీట్మెంట్ లో భాగంగా కొద్ది రోజుల క్రితం భూటాన్ లో ఆయుర్వేద చికిత్సను తీసుకుంది. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది సమంత. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండో పెళ్లి చేసుకొని జీవితంలో సంతోషంగా ఉండాలని సమంత తల్లిదండ్రులు ఆమెను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తోంది.

అయితే సమంతకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు కానీ.. తన మనసులో తల్లి కావాలి అన్న కోరికను ఎక్కడ కూడా చంపేయలేదట. దీంతో రెండో పెళ్లి చేసుకోకుండానే తల్లి కావడానికి సులభ మార్గాలను వెతుక్కుంటుందట. ఈ క్రమంలోనే ఎవరైనా అనాధ పిల్లలను అడాప్ట్ చేసుకోవాలని ట్రై చేస్తోందట. ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం సమంత గురించి ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. ప్రతిరోజు… నాగచైతన్య ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అతనికి సంబంధించిన అన్ని సోషల్ మీడియాలను… ఒక ప్రైవేట్ అకౌంట్ ద్వారా సమంతా ఫాలో అవుతుందట. ప్రతిరోజు నాగ చైతన్య ఫోటోలు చూసి సమంత సంతోషపడుతూ ఉందని సమాచారం.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు