Bollywood: తెరపైకి మరో వివాదం..త్రిష బాటలో ఐష్..!

నిన్నటికి నిన్న కోలీవుడ్ హీరోయిన్ త్రిష కి మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పడంతో సమస్య కాస్త సద్దుమణిగింది. అయితే ఇప్పుడు తెరపైకి మరో వివాదం రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. మన్సూర్ అలీ ఖాన్ లియో సినిమాలో నటించగా.. అందులో తనతో పాటు కలిసి నటించిన త్రిష గురించి ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. “త్రిష ను రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నాను కానీ అందులో లేదు.. దాంతో చాలా బాధపడ్డాను.. త్రిషని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాలని అనుకున్నాను.. కానీ ఆమెకు నాకు మధ్య ఒక సీన్ కూడా డైరెక్టర్ పెట్టలేదు” అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.

దీంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది .ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న త్రిష మన్సూర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు ఆమెకు పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతు పలికారు. ఇకపోతే మన్సూర్ క్షమాపణ చెప్పను అని మీడియా సముఖంగా చెప్పడంతో జాతీయ మహిళా కమిషన్ తో పాటు చెన్నై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఆయనను అరెస్టు చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు దిగివచ్చి త్రిషకు క్షమాపణలు చెప్పారు మన్సూర్. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు తెరపైకి మరో కొత్త వివాదం వచ్చింది.

రాధా రవి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సింగర్ చిన్మయి బయటకు తీసింది. ప్రముఖ నటుడు రాధా రవి గతంలో మాట్లాడిన మాటలను తాజాగా ఈమే తెరపైకి తీసుకొచ్చింది. రాధా రవి ఒక ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ మీద వెకిలిగా మాట్లాడిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు చిన్మయి తెరపైకి తీసుకురావడంతో మరొకసారి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒకవేళ తనకు హిందీ వచ్చి ఉంటే ఐశ్వర్య రాయ్ ని రేప్ చేసి ఉండేవాడిని. అక్కడివాళ్ళు నాకు మంచి పాత్రలు ఎలాగో ఇచ్చేవారు కాదు.. అలాంటి రేప్ చేసే పాత్రలే వచ్చేవి అంటూ రాధా రవి అప్పట్లో కామెంట్లు చేశారు. ఇక ఆరోజున ఆయన స్టేజిపై మాట్లాడిన మాటలను జోక్ గా తీసుకొని అక్కడి వారంతా నవ్వారు.. కానీ ఇప్పుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల మీద అందరూ ఫైర్ అవుతున్నారు.. మన్సూర్ పై చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు.

- Advertisement -

కానీ ఆరోజు రాధా రవి మీద ఎందుకు.. ఎవరు ఎలాంటి రియాక్షన్ చూపించలేదో నాకు అర్థం కావడం లేదు అంటూ చిన్మయి ప్రశ్నించింది. ఇలాంటి వ్యక్తులు మానవ వాలికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు అంటూ కూడా తన సహనాన్ని వ్యక్తం చేసింది చిన్మయి. మొత్తానికైతే ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు