Adhikeshava: ఏం ప్లానింగ్ బాసు.. ఆదికేశవ కథ నచ్చినా.. రిజెక్ట్ చేసిన మెగా హీరో..!!

శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆదికేశవ. నవంబర్ 24 వ తేదీ శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి నెగిటివ్ టాక్ అందుకుంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. జీవి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. అయితే వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ మూవీ ఉప్పెనతో వంద కోట్ల కలెక్షన్ రాబట్టి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వైష్ణవ్ ఆ తర్వాత కథలను ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఉప్పెన తరువాత కొండపొలం, రంగ రంగ వైభవంగా అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇప్పుడు ఆదికేశవ అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా నెగటివ్ టాక్ తో వైష్ణవ్ కి మరో డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పటివరకు కేవలం క్లాస్ లుక్స్ లో కనిపించిన వైష్ణవ్ ఈ సినిమాలో మాస్ హీరోగా ఆకట్టుకున్నాడు.

అయితే దర్శకుడు ఈ కథను ముందుగా వరుణ్ తేజ్ కోసం రాసుకున్నారట. ఈ సినిమా కథని వరుణ్ తేజ్ కి వినిపించగా ఆయనకి కూడా కథ బాగా నచ్చిందట. కానీ ఈ కథ తనకంటే వైష్ణవ్ తేజ్ కి బాగా సూట్ అవుతుందని భావించి ఈ కథ నచ్చినప్పటికీ ఈ సినిమాని రిజెక్ట్ చేసి వైష్ణవ్ తేజ్ ఖాతాలో పడేలా చూశాడు వరుణ్ తేజ్. దీంతో వరుణ్ తేజ్ ప్లాన్ చేసి ఓ ఫ్లాప్ సినిమాని వైష్ణవ్ తేజ్ ఖాతాలో వేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు