Adikeshava Effect: వైష్ణవ్ కి క్లాస్ పీకిన మెగాస్టార్… ఇక “గీత” గీయాల్సిందేనా?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. డెబ్యూ హీరోల్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన రికార్డు ఇప్పటికీ వైష్ణవ్ పేరు పైనే ఉంది. స్టార్ హీరోల వారసులు కూడా ఈ రికార్డుని బ్రేక్ చేయడం కష్టం. అయితే ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్ తేజ్.. మరో మూడు సినిమాల్లో హీరోగా నటించాడు.అవే ‘కొండపొలం’ ‘రంగ రంగ వైభవంగా’ ‘ఆదికేశవ’ ఇందులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. పైగా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ప్లాప్ అయ్యాయి. ‘కొండపొలం’.. అనేది ఓ క్లాస్ మూవీ. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కాబట్టి.. దాని బాక్సాఫీస్ ఫలితానికి జనాలు పేరు పెట్టరు… విమర్శించరు.

కానీ ‘రంగ రంగ వైభవంగా’ ‘ఆదికేశవ’ సినిమాల సంగతి వేరు. ‘రంగ రంగ వైభవంగా’… కథలో కానీ కథనంలో కానీ ఎంత మాత్రం కొత్తదనం ఉండదు. కానీ ఆ సినిమాలో వైష్ణవ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ‘బాయ్ నెక్స్ట్ డోర్’ వంటి పాత్రలో చాలా హుషారుగా నటించాడు. అయితే ‘ఆదికేశవ’ సినిమాలో మాత్రం వైష్ణవ్ నటన ఆకట్టుకునే విధంగా లేదు. వాస్తవానికి ఈ రేంజ్ మాస్ కథలు మోయగల ఇమేజ్ ఇంకా అతనికి రాలేదు. మొదటి సినిమా సక్సెస్ అంతా హీరోయిన్ కృతి శెట్టి అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఖాతాలో పడింది అనేది అతను గ్రహించాలి. ‘రంగ రంగ వైభవంగా’ ‘ఆదికేశవ’ వంటి సినిమాలు ఇంకో రెండు చేస్తే అతను కూడా శిరీష్..లా అయిపోయే ప్రమాదం ఉంది.

అందుకే మెగాస్టార్ చిరంజీవి… ‘ఆదికేశవ’ తర్వాత వైష్ణవ్ కి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. వెంటనే అల్లు అరవింద్ ని కూడా రప్పించి సాయి ధరమ్ తేజ్ ని సెట్ చేసినట్టు… వైష్ణవ్ తేజ్ కెరీర్ ను కూడా గాడిలో పడే విధంగా చేయాలని చెప్పారట. సో వైష్ణవ్ నెక్స్ట్ సినిమా విషయంలో ‘గీతా ఆర్ట్స్’ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వైష్ణవ్ కి సెట్ అయ్యే కథ కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు