Prabhas: పక్కన నటించి పెద్ద తప్పు చేశానంటున్న ఆ హీరోయిన్..!

పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ పక్కన నటించి పెద్ద తప్పు చేశానని బాలీవుడ్ హాట్ బ్యూటీ తన సన్నిహితుల వద్ద చెప్పి వాపోయినట్టు బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఆ హాట్ బ్యూటీ మరెవరో కాదు శ్రద్ధా కపూర్. ఈమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధ.. లౌవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2013లో విడుదలైన ఆషికీ – 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫెర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. ఇలా బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రద్ధ అనూహ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా సినిమా సాహో. బాహుబలి అంచనాలను సాహోతో ప్రభాస్ అందుకోలేకపోయాడు. బాహుబలి సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు కేటాయించి ప్రభాస్ నటించిన చిత్రమిది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కథ, కథణం ఈ సినిమా ఫ్లాప్ కి కారణం అయితే.. హీరోయిన్ గా నటించిన శ్రద్ధా కపూర్ ఈ సినిమా ఫ్లాప్ కి మరో కారణం అయింది.

భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకున్న శ్రద్ధా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేస్ ఈ చిత్రానికి పెద్ద మైనస్ అయ్యారు. అయితే ఎప్పుడూ టాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఆశలు పెట్టుకునే బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ మంచి లాంచింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అలా ఎదురుచూసిన శ్రద్ధాకి మంచి అవకాశం వచ్చినప్పటికీ అది డిజాస్టర్ కావడంతో చాలా డిసప్పాయింట్ అయింది. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తుందట.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు