Box office: టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ డే లెక్క.. హైప్ కి ఓపెనింగ్స్ కి మ్యాచ్ కాలేదు?

టాలీవుడ్ లో ఈ వారం దసరా కానుకగా మూడు బడా సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో లియో డబ్బింగ్ సినిమా కాగా, మరొకటి భగవంత్ కేసరి, ఇంకోటి రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ మూడు సినిమాలకి మిక్సడ్ టాక్ రాగా, ఒకరోజు గ్యాప్ వల్ల టైగర్ నాగేశ్వరరావు సినిమాకి తక్కువ థియేటర్లు దొరికాయి. దాంతో సినిమా ఫస్ట్ డే ఊహించిన దానికన్నా తక్కువ కలెక్షన్లు వసూలు చేసింది.

అక్టోబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ ని మెప్పించినా, ల్యాగ్ వల్ల, కామన్ ఆడియన్స్ కి విసుగు తెప్పించేలా తయారయింది. ఇక ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో టైగర్ నాగేశ్వరరావు 4.30 కోట్ల కి పైగా షేర్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 5.20 కోట్ల షేర్, 9.30 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక ఇతర భాషల్లో ఆయా లాంగ్వేజ్స్ కి చెందిన స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ కావడం వల్ల టైగర్ ని అసలు పట్టించుకోలేదు.

అయితే తెలుగులో డబ్బింగ్ సినిమా లియో కన్నా కూడా, రవితేజ సినిమాకి తక్కువ రావడం గమనార్హం. అయితే అరవ సినిమాలు ఎలా ఉన్నా కూడా చూసే కొందరు బ్యాచ్ తెలుగు సినిమాని ఎంకరేజ్ చేయకపోవడం బాగాలేదని రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అయితే దసరా అడ్వాంటేజ్ తో టైగర్ నాగేశ్వరరావు సినిమాకి వీకెండ్ లో భారీగా పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 37కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 32 కోట్లు వసూలు చేయాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు