Telugu New Movie: అనన్య పాండే అంటే హడలెత్తిపోతున్న నిర్మాత… కారణం ఏంటంటే?

Telugu New Movie

బాలీవుడ్‌లో తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనన్య పాండే. అది లక్ వల్ల అయి ఉండొచ్చు. లేదా అమెకు వచ్చిన అవకాశాల వల్ల కావచ్చు. కానీ, అనన్యకి కావాల్సినంత క్రేజ్ మాత్రం వచ్చేసింది. ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అయినా, ఆమె క్రేజ్‌కి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగడం లేదు అనేది మాత్రం నిజం.

అయితే తన లక్‌ను టాలీవుడ్‌లో లైగర్‌తో చెక్ చేసుకుంది. కానీ, అది అట్టర్ ఫ్లాప్ కావడంతో మళ్లీ తెలుగు చిత్ర సీమ వైపు తిరిగి చూడలేదు. అయితే తాజాగా అనన్య పాండేపై ఓ తెలుగు హీరో మోజు పడ్డారట. తన సినిమాలో హీరోయిన్‌గా అనన్య పాండేనే తీసుకోవాలని డైరెక్టర్‌తో పట్టుపడుతున్నారని తెలుస్తోంది. అంతే కాదు, అనన్య పాండేతో చర్చలు కూడా జరిపారట.

టాలీవుడ్‌లో చక్రం తిప్పాలని కలలు కంటున్న అనన్య పండే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. కానీ, ఆ సినిమా నిర్మాత మాత్రం హీరోయిన్ అనన్య పాండే అంటనే హడలెత్తిపోతున్నాడట. అనన్య పాండే అంటే ససేమిరా కదురదు అని చెప్పేస్తున్నాడట. సెంటిమెంట్స్ బాగా నమ్మే సదరు నిర్మాత, లైగర్ మూవీ రిజెల్ట్‌ను గుర్తు చేస్తున్నాడట. అయినా, ఆ హీరో మాత్రం అనన్య పాండే కాకుండా వేరే హీరోయిన్ వద్దని తెగేసి చెబుతున్నాడట. దీంతో ప్రస్తుతం ఈ సినిమా ముందుకు సాగడం లేదని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

ఇది విన్న టాలీవుడ్ సర్కిల్ జనాలు… అనన్య పాండే సినిమాలో అడుగు పెట్టకముందే, సినిమా ఆగిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, టాలీవుడ్‌కి వచ్చిన మొదటి సినిమానే డిజాస్టార్ కావడంతో అనన్యను తెలుగు ఆడియన్స్, ముఖ్యంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ ఐరెన్ లెగ్ అనే ట్యాగ్‌ను ఇప్పటికే వేసేశారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు