Trisha Krishnan: ఆఫర్ కోసం త్రిష అంత దారుణాన్ని కూడా భరించిందా..?

Trisha Krishnan

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుండో ఉన్నా కానీ, ఇటీవల నటీనటులు ఈ అంశం మీద ఎక్కువగా నోరు తెరుస్తున్నారు. ఆఫర్ల కోసం, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం కొంతమంది కాంప్రమైజ్ అయ్యి డైరెక్టర్స్, హీరోస్, ప్రొడ్యూసర్స్ అడిగే కమిట్మెంట్ కి ఓకే చెప్తుంటే ఇంకొంత మంది మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తమ ట్యాలెంట్ నే నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటారు.

తాజాగా హీరోయిన్ త్రిష గురించి నటి మీరా మిధున్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన మీరా తరచూ హీరోల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది.

తాజాగా మీరా త్రిష గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. త్రిష హీరోయిన్ గా నటించిన ఒక సినిమాలో తాను ఒక చిన్న క్యారెక్టర్లో నటించానని, ఆ సినిమా షూటింగ్ లో ఓ ప్రముఖ నటుడు త్రిషను తాకరాని చోట పదే పదే తాకాడని, అయినప్పటికీ ఆఫర్ కోసం త్రిష భరించిందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

త్రిష లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి దారుణాల్ని భరిస్తూ పోతే, ఇక తమలాంటి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించింది మీరా మిథున్. మీరా సదరు నటుడి పేరు వెల్లడించకపోవటంతో, అతను ఎవరై ఉంటాడా అని నెటిజన్స్ రీసర్చ్ మొదలు పెట్టాడు. మరో పక్క, ఓవర్ నైట్ ఫేమ్ కి అలవాటు పడ్డ ఇలాంటి వాళ్ళు సెలెబ్రిటీల మీద ఇలాంటి రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు