Tollywood: తమిళ డైరెక్టర్ల మోజులో పడి డిజాస్టర్స్ అందుకున్న తెలుగు హీరోలు..!

ప్రస్తుతం టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియా రేంజ్ పెరిగి, మన హీరోలకు, డైరెక్టర్లకు ఇతర భాషల్లో డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇటీవల తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న తరుణంలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. అదేంటంటే, తెలుగు హీరోలు తమిళ దర్శకులతో తీసిన సినిమాలు చాలా వరకు ఆ హీరోలకు ఫ్లాప్స్ ని మిగిల్చాయి. పవన్ కళ్యాణ్, విష్ణువర్ధన్ ల కాంబినేషన్లో వచ్చిన పంజా నుండి మొదలు పెడితే మహేష్ బాబు మురుగ దాస్ కాంబోలో వచ్చిన స్పైడర్, విజయ్ దేవరకొండ, ఆనంద్ శంకర్ ల కాంబినేషన్లో వచ్చిన నోటా కూడా ఫ్లాప్ అయ్యింది.

నిజానికి మన హీరోలు తమిళ దర్శకులతో తీసిన సినిమాలన్నీ భారీ అంచనాల నడుమ విడుదలయ్యాయి కానీ, అవి ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. తాజాగా, ఎప్పటినుండో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య కూడా తమిళ దర్శకుడితో చేసిన సినిమా డిజాస్టర్ తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకులు తెలుగు హీరోలకు కలిసిరాలేదన్న వాదన వినిపిస్తోంది సోషల్ మీడియాలో.

కథలో కంటెంట్ ఉంటే, బాషతో సంబంధం లేకుండా సినిమాలను హిట్ చేసే ప్రేక్షకులు దర్శకుడు ఇతర బాషకు సంబందించిన వాడు అయినంత మాత్రాన సినిమాను ఫ్లాప్ చేస్తారని అనలేం. కథలో కొత్తదనం లేకపోవటం వల్లే కస్టడీ సినిమా వర్కౌట్ అవ్వలేదన్న సత్యం అభిమానులు గ్రహించాలి. అక్కినేని వారి వరుస డిజాస్టర్స్ పరంపరకు కస్టడీ సినిమా కూడా అడ్డుకట్ట వేయలేకపోవటంతో అక్కినేని అభిమానులు నిరాశకు గురయ్యారు. మరి,  అక్కినేని హీరోల నుండి వచ్చే తదుపరి సినిమా అయినా హిట్ అయ్యి ఫ్యాన్స్ ఆకలి తీర్చుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు