Custody: సమంత, చైతు అభిమానుల మధ్య వార్..!

అక్కినేని నాగ చైతన్య, సమంత దంపతులు విడాకులు తీసుకొని చాలా కాలం అయినప్పటికీ, ఆ అంశం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. చాలా సందర్భాల్లో సమంతను టార్గెట్ చేస్తూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేశారు. ఇటీవల సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ మొదలైన నాటి నుండి సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యేంతవరకు వదల్లేదు అక్కినేని అభిమానులు. తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవటంతో సమంత ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. కస్టడీ మొదటిరోజు కలెక్షన్స్ శాకుంతలం కంటే తక్కువ రావటంతో అక్కినేని అభిమానులను ఎద్దేవా చేస్తున్నారు సమంత అభిమానులు.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కస్టడీ సినిమా తొలి ఆట నుండే నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవటంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 1.83కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేయగలిగింది. దీంతో ఆ కలెక్షన్స్ ని శాకుంతలం సినిమా కలెక్షన్స్ తో పోలుస్తూ అక్కినేని అభిమానులను ఎద్దేవా చేస్తున్నారు సమంత అభిమానులు.

చైతు, సమంత విడిపోయి ఎవరి జీవితాలు వారు గడుపుతుంటే, అభిమానులు మాత్రం తరచూ ఇలా మాటల యుద్దానికి దిగుతూ వివాదాలు సృష్టిస్తున్నారు. కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో సమంతతో విడాకుల విషయం, ఆ అంశంఫై వస్తున్న రూమర్స్ గురించి స్పందించిన నాగచైతన్య సమంత మీద తనకున్న గౌరవాన్ని వ్యక్తపరిచి నప్పటికీ అభిమానులు ఈ తరహాలో మాటల యుద్దానికి దిగటం హర్షించదగ్గ పరిణామం కాదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు