Power Star: పవన్ స్పీడ్ వెనక త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..!

రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. పవన్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజిత్ డైరెక్షన్లో ఓజీ, హాష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్, సాయిధరమ్ తేజ్ తో కలిసి సముద్రఖని డైరెక్షన్లో వినోదాయ సీతాం రీమేక్ గా ఒక సినిమాను లైన్లో పెట్టాడు. వీటికి తోడు దర్శకుడు సుధీర్ వర్మకి కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడంటూ వార్తలొచ్చాయి ఇటీవల. సుధీర్ వర్మతో సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ, తాజాగా పవన్ మరో సినిమా చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది సోషల్ మీడియాలో. ఎప్పుడూ లేనిది పవన్ ఇలా వరుసగా సినిమాలు చేయటం వెనక త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.

అలవైకుంఠపురంలో సినిమా తర్వాత ఏ సినిమా డైరెక్ట్ చెయ్యని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా వ్యవహారాలు చూసుకునే బాధ్యత తీసుకున్నాడని అంటున్నారు. 2024లో పవన్ ఎలక్షన్ హడావిడిలో పడిపోతాడు కాబట్టి ఈ లోపు వీలైనన్ని సినిమాలు లైన్లో పెట్టాలన్నది త్రివిక్రమ్ ప్లాన్ అని అంటున్నారు. అందుకే ఏ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ 30, 40రోజులకు మించి డేట్స్ కేటాయించటం లేదన్నది సమాచారం. ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యాక పవన్ డైరీలో 40రోజులకు పైగా డేట్స్ మిగిలిపోతాయి కాబట్టి, ఇప్పటికే పవన్ రామ్ తాళ్లూరికి ఒక సినిమా చేయాల్సి ఉన్నందున త్రివిక్రమ్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తునందుకు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏ సినిమాకు కూడా 40రోజుల మించి డేట్స్ కేటాయించకపోవటం, పైగా ఎక్కువ శాతం రీమేక్ సినిమాల మీదనే ఆధారపడటం పట్ల సినిమా క్వాలిటీపై ప్రభావం పడుతుందా అన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క సాయిధరమ్ తేజ్ కలిసి చేసిన రీమేక్ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయకపోవటం పట్ల ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు