Trisha Krishnan: స్టార్ హీరోయిన్‌తో లిప్ కిస్.. చచ్చినా చేయనని చెప్పేసిన తమిళ హీరో..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సినిమాలో బోల్డ్ సీన్ ఉంటే తప్ప చాలా మంది ప్రేక్షకులు ఎంజాయ్ చేయరు. అందుకే ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని దర్శకులు ఈ విషయాలను సినిమాల్లో జొప్పిస్తున్నారు. సినిమాలో ఇంటిమేట్ సీన్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకులు ఆకర్షితులవుతారు. ఇక హీరోలు కూడా మారుతున్న కాలానికి తమ పద్ధతులను మార్చేసుకుంటున్నారు. కానీ ఓ కోలీవుడ్ స్టార్ హీరో మాత్రం ఓ హీరోయిన్ తో లిప్ లాక్ చేయమంటే ఏకంగా సినిమానే ఆపేస్తానని ముఖం మీదే చెప్పేశాడట.

ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అతను ఎవరో కాదు… తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. త్రిష జంటగా నటించిన 96 సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ క్లాసికల్ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇందులో సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రలలో నటించగా.. ఈ సినిమా తెలుగులో అంతగా హిట్ కాలేకపోయింది.

అయితే 96 సినిమా ఆఖరి సీన్ లో త్రిష – విజయ్ సేతుపతి మధ్య లిప్ లాక్ సీన్ రాసుకున్నాడట దర్శకుడు. అప్పటివరకు చాలా పద్ధతిగా సాగిపోతున్న లవ్ స్టోరీ లో ఇలాంటి సీన్ పెడితే జనాలు యాక్సెప్ట్ చేయరని.. ఇలాంటి సీన్ తాను చేయనని విజయ్ సేతుపతి దర్శకుడి ముఖానే చెప్పేశారట. ఆ కారణంగానే త్రిషతో అలాంటి సీన్ మిస్ చేసుకున్నాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు